బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరింత మేర కష్టాల్లో పడనున్నారా? ఇప్పటిదాకా మహిళా సంఘాలే ఈ చిత్రంపై పోరాటం సాగిస్తే... ఇప్పుడు మరిన్ని వర్గాలు కూడా వర్మపై ముప్పేట దాడికి దిగనున్నారా? మొత్తంగా వర్మ పెద్ద సుసడిగుండంలోనే చిక్కుకోబోతున్నారా? అన్న అనుమానాలు ఇప్పుడు పెద్ద సంచలనంగానే మారిపోయాయి. గాడ్ - సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) పేరిట ఓ లఘు చిత్రాన్ని తెరకెక్కించిన వర్మ... దానిని వెబ్ వేదికగా విడుదల చేశారు. విమియో వెబ్ సైట్ లో విడుదలైన ఈ చిత్రం చాలా మంది నుంచి ప్రశంసలను అందుకున్న మాట అయితే వాస్తవమే గానీ... అంతేస్థాయిలో విమర్శలను కూడా ఈ చిత్రం మూటగట్టుకుంది. గుట్టుగా ఉండాల్సిన వ్యవహారాలన్నీ కూడా బహిరంగం చేసేలా వర్మ జీఎస్టీ చిత్రాన్ని తెరకెక్కించారని, కొన్ని సున్నిత అంశాలకు సంబంధించి గోప్యత పాటించడంతో పాటు భక్తి భావం అధికంగా కనిపించే భారత్ లాంటి దేశంలో పుట్టిన వర్మ... సెక్స్ ను బహిరంగం చేసేసి... దానిని దైవత్వంతో ముడిపెట్టిన వైనంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తూనే ఉంది. అయితే వర్మ కూడా ఈ చిత్రంపై తనదైన శైలి వాదనను ఇప్పటికే వినిపించాయి. అదే సమయంలో ఓ టీవీ చర్చావేదికకు హాజరైన సందర్భంగా మహిళా సంఘాల నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మ పోలీసుల విచారణను కూడా ఎదుర్కొంటున్నారు.
గత వారం ఓ పర్యాయం హైదరాబాదు సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరైన వర్మ... ఈ శుక్రవారం కూడా పోలీసు విచారణకు హాజరుకానున్నారు. తొలి రోజు విచారణలోనే పోలీసులు సంధించిన ప్రశ్నలకు చాలా ఇబ్బంది పడిన వర్మ... విచారణ ముగిసిన తర్వాత మీడియా చుట్టుముట్టినా కిమ్మనకుండా కారెక్కేసి తుర్రుమన్నారు. అయితే ఇంటికెళ్లే దాకా సైలెంట్ గానే ఉన్న వర్మ... ఆ తర్వాత పోలీసుల విచారణపైనా తనదైన రీతిలో సోషల్ మీడియాలో పలు కామెంట్లు చేశారు. మొత్తంగా తనపై ఒత్తిడి పెరుగుతున్నా... తాను కష్టాల్లో చిక్కుకున్నానని తెలిసినా కూడా వర్మ చాలా లైట్ గానే తీసుకుంటూ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే... ఇప్పుడు జీఎస్టీపై ఓ సంచలన వివాదం రేకెత్తేలానే ఉంది. ఈ వివాదం మత విశ్వాసాలకు సంబంధించిన వివాదం కావడంతో వర్మకు పెద్ద దెబ్బ తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో వర్మ అరెస్టైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న విశ్లేషణ కూడా సాగుతోంది.
అసలు ఈ వివాదం ఏమిటన్న విషయానికి వస్తే... జీఎస్టీ చిత్రం ప్రారంభమయ్యే సమయంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా ఓంకారం వినిపించిందట. అంతేకాకుండా జీఎస్టీ చిత్రంలో నటించిన పోర్న్ స్టార్ మియా మాల్కోవా మర్మాంగంపై ఓంకారం నాదం వినిపించిందన్న వాదన ఇప్పుడు నిజంగానే అందరినీ షాకింగ్‌కు గురి చేస్తోందని చెప్పాలి. వర్మ తెరకెక్కించిన చిత్రానికి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే. మియా మర్మాంగంపై ఓంకార నాదం, పలు దేవతా చిత్రాలకు స్వరాలు అందించిన కీరవాణి లాంటి డైరెక్టర్ ఈ సంగీతాన్ని అందించడం ఇప్పుడు నిజంగానే సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంపై టాలీవుడ్ రచయిత జయకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. జీఎస్టీ చిత్రంలో మియా మర్మాంగంపై ఓంకార నాదం వినిపించిన తీరు... హిందూ ధర్మ కట్టుబాట్లకు గొడ్డలిపెట్టేనని జయకుమార్ ఆరోపించారు. ఓ హిందువుగా ఉన్న వర్మ, అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయిబాబా వంటి భక్తిరస చిత్రాలకు స్వరాలు అందించిన కీరవాణి... సెక్సే ప్రధానంగా సాగిన జీఎస్టీకి సంగీతం సమకూర్చేందుకు ఎలా అంగీకరించారని జయకుమార్ ప్రశ్నిస్తున్నారు.
అంతేకాకుండా హిందువులు పరమ పవిత్రంగా భావించే ఓంకార నాదాన్ని మియా మర్మాంగంపై ప్లే చేయడానికి కీరవాణి ఎలా ఒప్పుకున్నారని, ఈ చర్య హిందువుల మనోభావాలను దెబ్బ తీసేదిగానే ఉందని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పటికే తాను రాసిన కథను వర్మ హైజాక్ చేశారని ఆరోపించిన జయకుమార్... ఇప్పుడు ఏకంగా హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని, ఈ విషయంలో తాను వర్మ, కీరవాణిలను వదిలే ప్రసక్తే లేదని కూడా చెబున్నారు. ఈ విషయంలో తాను ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించిన జయకుమార్... మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే... జీఎస్టీపై ఇప్పటికే ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో పాటుగా వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. వర్మను అరెస్ట్ చేయడంతో పాటుగా వెబ్ వేదిక నుంచి కూడా జీఎస్టీని రద్దు చేసేదాకా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు చెబుతున్న తీరు కూడా వర్మకు చిక్కులు తెచ్చి పెట్టేలానే ఉందన్న వాదన వినిపిస్తోంది. చూద్దాం... ఏం జరుగుతుందో?