సూపర్ స్టార్ రజినీకాంత్ దీపావళి సందర్బంగా అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరున్న శివ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందింది. భారీ అంచనాల నడుమ రూపొందిన అన్నాత్తే సినిమా ను తెలుగు లో పెద్దన్న పేరుతో డబ్ చేసి అదే దీపావళికి విడుదల చేశారు. తమిళంలో అన్నాత్తే మంచి వసూళ్లను దక్కించుకుంది. సినిమాకు అక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. కాని తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్దన్న కు ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వలేదు. మరీ దారుణంగా కొన్ని సెంటర్లలో పరిస్థితి ఉందంటూ గ్రౌండ్ రిపోర్ట్ వస్తోంది. పెద్దన్న సినిమా మరీ పాత చింతకాయ పచ్చడి అన్నట్లుగా నెటిజన్స్ ట్రోల్ చేశారు. శివ సినిమా అంటేను ఇలా ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
భారీ స్టార్ కాస్టింగ్ ఉన్నా కూడా దర్శకుడు శివ వినియోగించుకోలేక ఏదో రొటీన్ మాస్ సినిమాను తీశాడని.. ఇలాంటి కథలు తెలుగు ప్రేక్షకులు ఎన్నో చూశారంటూ నెటిజన్స్ కౌంటర్ ఇస్తున్నారు. అన్నాత్తే ఈ రేంజ్ బ్యాడ్ టాక్ ను దక్కించుకుంటున్న సమయంలో తమిళ మీడియా వర్గాల్లో వస్తున్న ఒక వార్త షాకింగ్ గా ఉంది. అది ఏంటీ అంటే రజినీకాంత్ మరోసారి శివ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు. వీరిద్దరి కాంబోలో సినిమా ఎంతో దూరంలో లేదట. అన్నాత్తేను మించిన మాస్ ఎంటర్ టైనర్ కథను రజినీకాంత్ కు వినిపించిన శివ మరో వైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను మొదలు పెట్టారనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి శివతో రజినీకాంత్ మరో సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యిందని తమిళ మీడియా బలంగా చెప్తోంది.
శివ దర్శకత్వంలో అజిత్ చేసిన సినిమాలు మంచి మాస్ విజయాలుగా నిలిచాయి. అందుకే తెలుగు లో కెరీర్ ఆరంభంలో సినిమాలు చేసిన శివ పూర్తిగా తమిళంకే పరిమితం అయ్యాడు. తమిళంలో ఇప్పుడు రజినీకాంత్ చేంత శివ చేరాడు. ఒక్క సారి శివతో సినిమా చేసిన ఏ హీరో అయినా వన్స్ మోర్ అనాల్సిందే అంటారు. అలా ఆయన మొదటి సినిమా చేస్తున్న సమయంలోనే తదుపరి సినిమా స్టోరీ లైన్ ను చెబుతూ ఉంటాడు. ఇప్పుడు రజినీకాంత్ తో కూడా అలాగే రెండవ సినిమా చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి దీపావళి సందర్బంగా వచ్చిన పెద్దన్న సినిమా ను మర్చి పోలేక పోతున్న తెలుగు ప్రేక్షకులు ఈ వార్తలు విని బాబోయ్ అనుకుంటున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.