కేజీఎఫ్ స్టార్ యష్ తన అభిమానులను మరో రెండు ప్రతిష్టాత్మకమైన పాన్-ఇండియా ప్రాజెక్ట్ లతో అలరించబోతున్నారా? అంటే అవుననే సమాచారం. KGF: చాప్టర్ 2 భారీ విజయం తర్వాత రాకింగ్ స్టార్ మరో రెండు ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ లలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. యష్ అభిమానులందరికీ శుభవార్త అందినట్టే.
కేజీఎఫ్ 2 హిందీ డబ్బింగ్ వెర్షన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 430.95 కోట్లను ఆర్జించగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1213 కోట్ల భారీ కలెక్షన్లను సాధించింది. ఇది రాకింగ్ స్టార్ యష్ రేంజును అమాంతం పెంచింది. అయితే ఇంతలోనే అతడు మరో రెండు భారీ పాన్-ఇండియా చిత్రాలతో అభిమానులను అలరించే ప్లాన్ లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
తాజా కథనాల ప్రకారం.. కేజీఎఫ్ నిర్మాతలు మరో రెండు పాన్-ఇండియా చిత్రాలపై విస్తృతంగా పని చేస్తున్నారు. హోంబలే ఫిలింస్ విజయ్ కిరగందూర్ స్వయంగా మీడియాకి ఈ విషయాన్ని వెల్లడించారు. “రానున్న మూడేళ్లలో మా వద్ద దాదాపు 14 సినిమాలు చేస్తున్నాం.
మేము భారతదేశం అంతటా విడుదలయ్యే రెండు భారీ చిత్రాల కోసం కూడా పని చేస్తున్నాము. వాటిలో ఒక సినిమా ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసాం. ఈ మూవీ 2024లో విడుదల అవుతుంది. KGF లాగానే ఆ రెండు చిత్రాల మెటీరియల్ కథాంశం యూనిక్ నెస్ తో వరల్డ్ ఆడియెన్ ని మెప్పిస్తాము. 2024 ఆగస్టు లేదా సెప్టెంబరులో విడుదలయ్యే ఒక చిత్రం వివరాల్ని మేం వెల్లడిస్తాము. మేము ఇప్పుడు తదుపరి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పై పని చేస్తున్నాం. అది 2025లో విడుదల కానుంది`` అని తెలిపారు.
బాక్సాఫీస్ వసూళ్ల పరంగా హిందీ చిత్రాలు దక్షిణాది సినిమాల ముందు బోల్తా కొడుతున్నాయి కదా! అని కిరగందూర్ ని ప్రశ్నిస్తే.. అన్ వర్స్ కోసం KGF: చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ నంబర్ ల విషయానికి వస్తే రన్‌వే 34 - జెర్సీ వంటి హిందీ చిత్రాలను వెనక్కి నెట్టింది... అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ``నార్త్ సౌత్ మధ్య అడ్డంకులు ఉండకూడదని కాదు. మనమందరం హిందీ చిత్రాలను ఆస్వాధిస్తాము. వారు కూడా మన సౌత్ చిత్రాలను చూస్తారు. మెటీరియల్ డీసెంట్ గా ఉంటే అందరూ చూస్తారు. మనం దక్షిణ కొరియా- జపనీస్ లేదా స్పానిష్ చిత్రాలను చూసినా కూడా భాషాపరమైన ఇబ్బందులు లేవు.
బహుళ ఉత్పత్తులు కొనాల్సి వస్తే మనం ఉత్తరం- దక్షిణం అంటూ గొడవపడము. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి విభేదాలు ఉండకూడదు. భూల్ భూలయ్యా 2 ఇప్పుడు భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇది పూర్తిగా కంటెంట్ పై ఆధారపడి ఉంటుంది. ఉత్పత్తి పేలవంగా ఉంటే ప్రజలు దానిని తిరస్కరిస్తారు`` అని అన్నారు. KGF: చాప్టర్ 2 ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా.. యష్ తో పాటు.. సంజయ్ దత్- రవీనా టాండన్ - శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించారు.