కార్తికేయ 3లో మరో హీరో.. మల్టివర్స్: నిఖిల్ 

Update: 2022-12-20 09:30 GMT
కార్తికేయ 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ నెక్స్ట్ 18 పేజెస్ అనే సినిమాతో రాబోతున్నాడు. సుకుమార్ రచనలో సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ అనుబంధ సంస్థ జిఏ 2 నిర్మించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో హీరో నిఖిల్ సిద్ధార్థ తదుపరి సినిమాల గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

ముఖ్యంగా కార్తికేయ 3 సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అది ఎలా ఉండబోతుంది అనే విషయంలో కూడా ప్రశ్నలు ఎదురవగా నిఖిల్ ఒక చిన్న వివరణ అయితే ఇచ్చాడు. అంతేకాకుండా ఆ ప్రాజెక్టు ఎలా అయినా రూపుదిద్దుకోవచ్చు అని కూడా అన్నాడు. కార్తికేయ 2 సినిమా సక్సెస్ అయిన తర్వాత ప్రస్తుతం అంచనాలు మరింత ఎక్కువగా పెరిగిపోయాయి. కాబట్టి దర్శకుడు చందు మొండేటి దానికి సంబంధించిన స్క్రిప్ట్ ను ఇంకా మరింత ఉన్నత స్థాయిలో తీసుకురావాలి అని ఆలోచిస్తున్నాడు.

అతనికి ప్రస్తుతం గీతా ఆర్ట్స్ లోనే ఒక సినిమా చేయాల్సిన కమిట్మెంట్ ఉంది. ఆ తర్వాత కార్తికేయ 3 గురించి ఆలోచించనున్నాడు. ఇప్పటికే స్టోరీ లైన్ గురించి కూడా చెప్పాడు. కొంత గ్యాప్ వచ్చిన తరువాత ఇద్దరం దుబాయ్ వెళ్లి అక్కడ సినిమా గురించి మాట్లాడుకునేలా ప్లాన్ చేస్తున్నాం. స్టోరీ లైన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అయితే ఆ ప్రాజెక్టు అనేది మల్టివర్స్ కూడా కావచ్చు.. లేదంటే అందులో ఎవరైనా స్టార్ హీరో కూడా మరో పాత్రలో రావచ్చు అని నిఖిల్ అన్నాడు.

అంచనాలు భారీగా పెరిగిపోయాయి కాబట్టి కథ విషయంలో కంటెంట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చందు వర్క్ అయితే చేస్తున్నాడు. బహుశా అన్ని కుదిరితే మాత్రం వచ్చే ఎడాది చివరలో కార్తికేయ 3 మొదలు కావచ్చు అని కూడా నిఖిల్ ఒక క్లారిటీతో చెప్పాడు. ఇక ప్రస్తుతం నాకు కూడా ఒక రెండు సినిమాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది.. వాటి తర్వాత కార్తికేయ 3 సెట్స్ పైకి వస్తుంది అని అన్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News