గుణశేఖర్ మరో చారిత్రాత్మక మూవీ.. హీరో ఎవరంటే..?

Update: 2021-06-08 03:30 GMT
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ కమర్షియల్‌ చిత్రాలతో పాటుగా పౌరాణిక, చారిత్రక నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. భారీ సెట్స్ భారీ బడ్జెట్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా నిలిచిన ఆయన.. చివరగా 'రుద్రమదేవి' అనే మైథాలజికల్ మూవీ తీసి సక్సెస్ అందుకున్నాడు. దీంతో 'ప్రతాపరుద్రుడు' అనే టైటిల్ రిజిస్టర్ చేయించిన గుణశేఖర్.. రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్రుడి చ‌రిత్ర ఆధారంగా సినిమా తీస్తానని అప్పుడే ప్ర‌క‌టించారు. అయితే ఇన్నాళ్లకు కరోనా లాక్ డౌన్ కారణంగా మళ్ళీ ఈ ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది.

'రుద్రమదేవి' తర్వాత దగ్గుబాటి రానాతో 'హిరణ్యకశ్యప' టైటిల్‌ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. సురేశ్‌‌ ప్రొడక్షన్స్‌ - గుణ టీమ్ వర్క్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసమే మూడేళ్లు కేటాయించారు.  అయితే కరోనా నేపథ్యంలో ఈ సినిమా ఆలస్యం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో శకుంతల - దుష్యంతుడి ప్రేమకథ పై దృష్టి సారించి.. సమంత ప్రధాన పాత్రలో 'శాకుంతలం' సినిమాని పట్టాలెక్కించాడు. ఇప్పటికే 50శాతం చిత్రీకరణ కూడా పూర్తి చేసిన గుణశేఖర్.. లాక్ డౌన్ లో 'ప్రతాపరుద్రుడు' స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే 'ప్రతాపరుద్రుడు' టైటిల్ రోల్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే బాగుంటుందని గుణశేఖర్ అభిప్రాయ పడుతున్నారట. ఇప్పటికే మహేష్ - గుణశేఖర్ కాంబోలో 'ఒక్కడు' 'అర్జున్' 'సైనికుడు' వంటి సినిమాలు వచ్చాయి. 'రుద్రమదేవి' సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రను మహేష్ తో చేయించాలని చూశారు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో అల్లు అర్జున్ తో ఆ పాత్ర చేయించారు. అయితే ఈసారి ఎలాగైనా ప్రతాపరుద్రుడు రోల్ మహేష్ తోనే చేయించాలని గుణశేఖర్ ఫిక్స్ అయ్యారట. మహేష్ ఇందుకు ఒప్పుకుంటారో లేదో చూడాలి. ఇకపోతే 'శాకుంతలం' 'హిరణ్యకశ్యప' సినిమాల తర్వాత గుణశేఖర్ ప్రతాపరుద్రుడు సినిమా ఉంటుందని తెలుస్తోంది.
Tags:    

Similar News