బాలీవుడ్ సెన్షేషన్ తను శ్రీ దత్తా- నానా పటేకర్ వివాదం గురించి చెప్పాల్సిన పనిలేదు. నానాపటేకర్ పై తను శ్రీ లైంగిక ఆరోపణలు అప్పట్లో దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనమయ్యాయో తెలిసిందే. ‘హార్న్ ఒకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించింది. ఆ తర్వాత నానా పటేకర్ కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం..పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలు తను శ్రీకి మద్దతుగా నిలవడం జరిగింది.
ఆ మధ్య బాలీవుడ్ మాఫియా తనని వేదిస్తుందని ఓ పోస్ట్ కూడా చేసింది. తాజాగా మరోసారి నానా పటేకర్ ని ఉద్దేశించి ఇన్ స్టా వేదికగా సంచలన పోస్ట్ చేసింది. `` నాకు ఏదైనా జరిగితే అందుకు నానా పటేకర్ కారణం అవుతారు. అతని లాయర్.. సన్నిహితులు..బాలీవుడ్ లో తన స్నేహితుల మాఫియా మాత్రమే కారణమని తెలసుకోండి.
సుషాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో బయటకి వచ్చిన పేర్లే బాలీవుడ్ మాఫియాలో ఉంటాయి. వీరందరికీ ఒకే లాయర్ కామన్ గా ఉంటాడు. వాళ్ల కేసులన్నీ ఆయనే డీల్ చేస్తుంటాడు. వారి సినిమాలు చూడకండి. ఇండస్ర్టీ నుంచి వారిని బహిష్కరించండి. కొంత మంది పరిశ్రమ వ్యక్తులు.. జర్నలిస్ట్ లు.. పీఆర్ టీమ్ నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి.
వాళ్లే తప్పుడు కథనాలు అల్లుతున్నారు.
వీళ్లెవ్వర్నీ విడిచిపెట్టకండి. వాళ్ల జీవితాల్ని క్రూరంగా..నరకంగా మార్చండి. చట్టం..న్యాయం..నాకు వ్యతిరేకంగా పనిచేయోచ్చు. కానీ దేశ ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. మరోసారి మళ్లీ కలుద్దాం` అని అక్కడితో పోస్ట్ ముగించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ వివాదం తెరపైకి వచ్చి నాలుగేళ్లు అవుతుంది.
కొంత కాలం పాటు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్చ జరిగినా ఆ తర్వాత అందరూ మర్చిపోయారు. ఈ విషయంలో నానా పటేకర్ పెద్దగా స్పందించింది లేదు. చట్టపరంగా ప్రోసస్ జరుగుతుంది. మళ్లీ ఈ వివాదంపై తను శ్రీ దత్తా సోషల్ మీడియాలో రచ్చకెక్కడం ఆసక్తికరంగా మారింది. మళ్లీ కలుద్దామని చెప్పింది కాబట్టి మరో సంచలన పోస్ట్ తో మళ్లీ ఇన్ స్టా లోకి రానుంది. మరి ఈసారి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో చూడాలి. చూస్తుంటే ఈ వివాదం మళ్లీ ముదిరేలానే కనిపిస్తుంది.