విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా తమన్నా-మెహ్రీన్ నాయికలుగా ఎఫ్ 3 చిత్రీకరణ ఇంతకుముందే ప్రారంభమైంది. కానీ ఈ సీక్వెల్ షూటింగ్ రకరకాల కారణాలతో నిలిచిపోవడం ఫిలింనగర్ వర్గాల్లో చర్చకు వచ్చింది. తాజాగా మరో 40 రోజులు ఎఫ్ 3 షూట్ ఆగిపోయిందని ప్రచారమవుతోంది.
ఎఫ్ 3 రెగ్యులర్ షూటింగ్ ఈపాటికే వేగంగా సాగాల్సినది ఎందుకనో కొంతకాలంగా ఆగిపోయింది. దీనికి కారణం వెంకీ ఇటీవలే దృశ్యం 2ని ప్రారంభించడమేనని ఆ సినిమా షెడ్యూల్స్ కోసమే కాస్త వేచి చూడాల్సి వస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు అనీల్ రావిపూడి వేరే సినిమాకి దర్శకత్వ పర్యవేక్షకుడిగా సమర్పకుడిగా ఉండి రిలీజ్ కోసం వేచి చూడడం కూడా ఒక కారణమని తెలుస్తోంది.
జీతు జోసెఫ్ దర్శకత్వంలో దృశ్యం 2 ఇప్పటికే సెట్స్ పై ఉంది. ఈ రీమేక్ షూటింగ్ ఏప్రిల్ మూడవ వారం వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ చివరి వారంలో ఎఫ్ 3 షూటింగ్ ని వెంకీ-రావిపూడి బృందం ప్రారంభించనున్నారని తెలిసింది. అనీల్ రావిపూడి సమర్పకుడిగా రచయితగా దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉన్న గాలి సంపత్ ఈ శుక్రవారం రిలీజైన సంగతి తెలిసినదే.