బాలీవుడ్లో రామ్ గోపాల్ వర్మ లాగా మరే సౌత్ ఇండియన్ డైరెక్టర్ ఆధిపత్యం చలాయించలేదు. దశాబ్దానికి పైగా ఆయన హవా సాగిందక్కడ. తర్వాత కొన్నేళ్ల పాటు తెలుగు దర్శకులెవరూ అక్కడ పాగా వేయలేకపోయారు. మధ్యలో పూరి జగన్నాథ్ 'బుడ్డా హోగా తేరా బాప్' అంటూ ఓ సినిమా చేసి వచ్చేశాడు. కానీ గత కొన్నేళ్లలో తెలుగు దర్శకులు ఒక్కొక్కరుగా బాలీవుడ్లో కాలు మోపుతుండటం విశేషం.
ఇప్పటికే 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'తో సందీప్ రెడ్డి బాలీవుడ్‌పై బలమైన ముద్ర వేశాడు. దాని తర్వాత రణబీర్ కపూర్ హీరోగా 'ఎనిమల్' అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక 'సాహో' డైరెక్టర్ సుజీత్ సైతం హిందీలో ఓ చిత్రం చేయనున్నాడు. పూరి జగన్నాథ్ 'లైగర్' సినిమాను హిందీలోనూ తీస్తున్న సంగతి తెలిసిందే. వి.వి.వినాయక్ సైతం 'ఛత్రపతి' రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా ఇప్పుడు మరో యువ దర్శకుడి చూపు బాలీవుడ్‌పై పడింది.
తొలి సినిమా 'ఘాజి'తోనే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సంకల్ప్ రెడ్డి.. డైరెక్ట్ హిందీ మూవీ చేయబోతున్నాడు. 'జేబీ 71' పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రముఖ నటుడు, తెలుగులో కూడా చాలా విలన్ పాత్రలు చేసిన విద్యుత్ జమాల్ తన సొంత ప్రొడక్షన్లో ఈ సినిమాను నిర్మించబోతుండటం విశేషం. ఇండియా-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో సినిమా నడుస్తుందంటున్నారు. విద్యుత్ కూడా ఇందులో ఓ కీలక పాత్ర చేయనున్నాడు.
బాలీవుడ్ రైటర్ ఆదిత్య శాస్త్రి అందించిన కథతో సంకల్ప్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడట. 'ఘాజి' తర్వాత తనపై భారీగా అంచనాలు పెంచిన సంకల్ప్.. రెండో సినిమా 'అంతరిక్షం'తో ఆకట్టుకోలేకపోయాడు. మరోసారి మంచి ప్రయోగమే చేశాడు కానీ.. అది ప్రేక్షకులకు రుచించలేదు. దీంతో మూడో సినిమా చేయడానికి టైం పట్టేసింది. ఈసారి అతను బాలీవుడ్లో పెద్ద ప్రాజెక్టే చేయబోతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.