'విశ్వంభర' డైరెక్టర్ ఆ సినిమాలో హీరో!
అయితే వశిష్ట డైరెక్టర్ కాక ముందు హీరో అని ఎంతమందికి తెలుసు. అవును తాజాగా ఈ విషయం బయట పడింది.
`విశ్వంభర` సినిమా డైరెక్టర్ ఎవరు? అంటే ఇప్పుడు అంతా చెబుతారు. మల్లిడి వశిష్ట అని. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడంతోనే వశిష్ట పేరు బాగా ఫేమస్ అయింది. అంతకు ముందు కల్యాణ్ రామ్ హీరోగా నటించిన` `బింబిసార`ని డైరెక్ట్ చేసింది ఇతడే. ఆ సినిమా విజయం చూసే చిరంజీవి విశ్వంభరకు అవకాశం ఇచ్చారు. అలా రెండవ సినిమాతోనే మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు.
ఈ సినిమా హిట్ అయితే ఆ తర్వాత పాన్ ఇండియా హీరోల్నే డైరెక్ట్ చేస్తాడు. అయితే వశిష్ట డైరెక్టర్ కాక ముందు హీరో అని ఎంతమందికి తెలుసు. అవును తాజాగా ఈ విషయం బయట పడింది. కులశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా ప్రేమ లేఖలో హీరోగా నటించింది వశిష్టనే. అయితే ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ ఆలస్యమ వ్వడంతోనే కులశేఖర్ మానసికంగా కృంగిపోయాడు. అనారోగ్యానికి గురయ్యాడు. అలా వశిష్ట దర్శకుడు కంటే ముందు హీరోగా మ్యాకప్ వేసుకున్నాడు.
అంటే వశిష్ట హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ అయ్యాడా? అన్న సందేహం రావడం సహజం. దానికి సమాధానం అతి త్వరలో తెలుస్తుంది. హీరోగా సక్సెస్ కానప్పటికీ డైరెక్టర్ గా మాత్రం వశిష్టకు మంచి భవిష్యత్ ఉంటుందని బింబిసారతోనే నిరూపించుకున్నాడు. అటుపై చిరంజీవినే డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో స్టార్ లీగ్ లో చేరిపోయాడు. ప్రతిభ గల వాళ్లకు అవకాశాలకు కొదవలేదు. ఒక్కసారి ఆ ట్యాలెంట్ ని నిరూపించుకునే ఓ అవకాశం రావాలి అంతే.
ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగిపోతారు. రిషబ్ శెట్టి, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్, చందు మొండేటి వీళ్లంతా పాన్ ఇండియా డైరెక్టర్లు అయ్యారు? అంటే కేవలం ట్యాలెంట్ తోనే. ముందుగా వీళ్లంతా చాలా చిన్న సినిమాలు చేసిన దర్శకులు. నేడు వందల కోట్ల ప్రాజెక్ట్ లు డీల్ చేస్తున్నారు.