నన్నెవరు విలన్‌ గా చూస్తారయ్యా

Update: 2020-12-05 23:30 GMT
హీరోగా కంటే విలన్‌ గా నటించిన వారికి యాక్టింగ్‌ స్కిల్స్‌ ప్రదర్శించే అవకాశం ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఒక హీరో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర చేస్తున్నాడు లేదా విలన్‌ గా కనిపించబోతున్నాడు అంటే అంతా కూడా ఎలా నటించాడు అంటూ ప్రత్యేకంగా చూస్తారు. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర చేసినప్పుడే నటుడిగా పూర్తి సార్థకత అంటూ ఉంటారు. టాలీవుడ్‌ హీరోల్లో ఒక్కరు తప్ప దాదాపు అంతా కూడా నెగటివ్‌ షేడ్స్‌ లో కనిపించిన వారే. ఒక్క అక్కినేని నాగేశ్వరరావు మాత్రమే విలన్‌ గా నటించలేదు.

కొన్నాళ్ల క్రితం ఆయన్ను ఒక ఇంటర్వ్యూలో మీరు ఎందుకు విలన్‌ గా నటించలేదు అనే ప్రశ్న ఉంచారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఏయన్నార్‌ స్పందిస్తూ అప్పట్లో నా ఫిజిక్‌ కు విలన్‌ గా చేస్తే ఏమైనా అర్థం ఉండేదా. అప్పుడు బక్కగా ఉన్న నన్ను విలన్‌ గా ఎవ్వరు కూడా పట్టించుకునే వారు కాదు. ఒక్కరు ఇద్దరు నన్ను విలన్‌ గా చూపించే ప్రయత్నం చేసినా కూడా నన్ను ఎవరు విలన్‌ గా చూస్తారయ్యా అనేవాడిని. విలన్‌ అంటే మంచి పర్సనాలిటీ.. కండలు తిరిగిన ఫిజిక్‌ ఉండాలి. కాని నేను సౌమ్యుడిగా కనిపిస్తాను. నాలాంటి వాడిని విలన్‌ గా ఎవరు ఒప్పుకోరు అందుకే నటించలేదు అన్నాడు.
Tags:    

Similar News