కపూర్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే జాన్వీ కపూర్ క్రేజీ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. తొందర్లోనే జాన్వీకి ఇంటి పోరు ఎదురుకానుంది. తన సోదరి ఖుషీ కపూర్ తనకు పోటీ కానుంది. ఖుషీ డెబ్యూ మూవీకి ఇప్పటికే సన్నాహకాలు సాగుతున్నాయి. ఇంతలోనే కపూర్ ఫ్యామిలీ నుంచి మరో అందాల భామ తెరకు పరిచయమయ్యే అవకాశాలున్నాయని హింట్ అందింది.
జాన్వీ- ఖుషీ సిస్టర్స్ కి స్టెప్ సిస్టర్ అన్షులా కపూర్ కథానాయికగా ఆరంగేట్రం చేసేందుకు ఛాన్సులు కనిపిస్తున్నాయని గుసగుస మొదలైంది. అయితే దీనిక కారణం లేకపోలేదు. అన్షుల అర్జున్ కపూర్ సోదరి అన్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్ మొదటి భార్యకు పుట్టిన ఆడబిడ్డ. అయితే అన్షులా పూర్తిగా బొద్దుగా కనిపిస్తుంది. పైగా తను మీడియా జూమ్ లో పెద్దగా కనిపించేందుకు ఆసక్తిగా ఉండదు. అయితే తాజాగా అన్షుల షేర్ చేసిన ఫోటోషూట్ షాక్ కి గురి చేస్తోంది. తన రూపం అమాంతం మారిపోయింది. తాజా రూపం చూశాక.. కత్రినా కైఫ్ సైతం తనని పొగిడేయకుండా ఆగలేకపోయింది!
అర్జున్ కపూర్ సోదరి అన్షుల మారిన రూపం సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. తన సోదరుడిలాగే అన్షులా ఇటీవల తన ఫిట్ నెస్ కు ప్రాధాన్యతనిస్తోంది. ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ తీసుకుంటోంది. కొన్ని నెలల క్రితం జిమ్ లో కసరత్తులు ప్రారంభించింది. ఆమె బరువు తగ్గడంపై చాలా ఎక్కువగా దృష్టి పెడుతోంది. దాని ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇటీవల తన మునుపటి రూపానికి ఇప్పటి రూపానికి మార్పు ఏమిటో ఆవిష్కరించేలా శారీరక పరివర్తనకు సంబంధించిన చిత్రాన్ని పంచుకుంది. పోస్ట్ లో అన్షులా అద్దం ముందు ఉన్న ఫోటోను పంచుకుంది. సాధారణ టీ-షర్ట్ - ట్రాక్ ప్యాంట్ లో అద్భుతంగా కనిపిస్తోంది. ఆమె బరువు తగ్గడం కత్రినా కైఫ్ సహా అందరినీ ఆకట్టుకుంది. కత్రినా ``నిన్ను చూడు`` అని వ్యాఖ్యానించింది. లవ్ ఎమోజీలను కత్రిన షేర్ చేసింది. కత్రినా వ్యాఖ్యలకు అన్షులా రెడ్ హార్ట్ ఎమోజీల శ్రేణితో సమాధానం ఇచ్చింది.
ఈ ఫోటోలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాయి. ఆమె సన్నిహితులు ఆమె బరువు తగ్గడంపై గగ్గోలు పెట్టేస్తున్నారు.తన ఫోటోని పంచుకుంటూ గాయకుడు కోల్బీ కైలట్ `ట్రై` పాటలోని సాహిత్యంతో పోస్ట్ కు శీర్షిక పెట్టారు. మొత్తానికి 120 కేజీలు పైగా బరువు ఉండే అర్జున్ కపూర్ తన వెయిట్ రిడక్షన్ కోసం ఎంతగా శ్రమించాడో తెలిసిందే. ఇప్పుడు తన సోదరి కూడా బరువు తగ్గేందుకు కఠినంగా శ్రమించిందని అర్థమవుతోంది. ఇంతకుముందు సారా అలీఖాన్ సైతం ఎంతో బొద్దుగా కనిపించేది. కానీ ఇప్పుడు రైజింగ్ హీరోయిన్ స్టాటస్ కి తగ్గట్టే ఎంతో స్లిమ్ గా ఉంది. అన్షులా తాజా మార్పు చూశాక ఇక జాన్వీ-ఖుషీలకు ఇంటిపోరు మొదలైనట్టేనని భావిస్తున్నారు.