హీరో గారి సిస్టర్ న్యూ లుక్ కు మతి పోతుంది.. ఇంత మార్పేమిటి అమ్మడు!

Update: 2022-03-08 13:30 GMT
బాలీవుడ్‌ స్టార్ ఫిల్మ్‌ మేకర్‌ బోనీకపూర్ కి మొదటి భార్య ద్వారా కలిగిన సంతానం అర్జున్‌ కపూర్‌ మరియు అన్షుల కపూర్‌. భార్య నుండి విడిపోయినా కూడా బోనీకపూర్‌ ఇద్దరు పిల్లలను చూసుకున్నాడు. ఇప్పటికి కూడా బోనీకపూర్‌ కు సన్నిహితంగా వీరిద్దరు ఉంటారు. బోనీ కపూర్‌ వారసత్వంతో అర్జున్‌ కపూర్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్‌ లో యంగ్‌ స్టార్‌  హీరోల జాబితాలో అర్జున్ కపూర్ ఒకరు అనడంలో సందేహం లేదు.

అర్జున్‌ కపూర్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు చాలా లావుగా కనిపించేవాడు. అతడి పర్సనాలిటీ చూసి అంతా కూడా నవ్వేవారు. ప్రస్తుతం బోనీ కపూర్‌ ఉన్నాడు కదా.. కాస్త అటు ఇటుగా అంతకు మించే ఉండేవాడు. అంతటి బరువును హీరో అవ్వాలి అనుకున్న వెంటనే తగ్గించుకున్నాడు. దాదాపుగా ఏడాది పాటు కష్టపడి బరువు తగ్గి ఆ తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. బొద్దుగా ఉన్న వ్యక్తి కష్టపడి సన్నగా మారడం మాత్రమే కాకుండా సిక్స్‌ ప్యాక్‌ కూడా చేశాడు.

అన్నయ్య అర్జున్‌ కపూర్‌ ను ఆదర్షంగా తీసుకుందో ఏమో కాని బోనీకపూర్ కూతురు అన్షుల కపూర్‌ కూడా చాలా బరువు తగ్గింది. రెండు సంవత్సరాల క్రితం అన్షుల ను ఇప్పటి అన్షుల ను చూస్తే అస్సలు పోలికే లేనంతగా మారిపోయింది అంటూ బాలీవుడ్‌ మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

ఈమె ఇంత బరువు తగ్గడానికి కారణం ఏంటో అంటూ చర్చలు మొదలు అయ్యాయి.

గతంలో సరా అలీ ఖాన్ కూడా చాలా బొద్దుగా దాదాపుగా 90 కేజీల బరువు ఉండేదట. ఆమె ఇప్పుడు 60 కేజీల బరువుకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ క్రేజీ అండ్‌ స్టార్‌ హీరోయిన్ గా కొనసాగుతుంది. హాట్‌ బ్యూటీ సరా అలీ ఖాన్ మాదిరిగా బోనీ కపూర్ కూతురు అన్షుల కపూర్‌ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని అంతగా బరువు తగ్గిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

రెండుళ్ల కష్టం కు ప్రతిఫలం అన్నట్లుగా అన్షు ఇన్‌ స్టా లో సుదీర్ఘ పోస్ట్‌ ను షేర్‌ చేసింది. తాను బరువు తగ్గడంకు తీసుకున్న జాగ్రత్తలు పాటించిన సూత్రాలు ఇంకా పలు విషయాలను గురించి ఆమె చెప్పుకొచ్చింది. ఇంకాస్త బరువు తగ్గితే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ లను సైతం బీట్‌ చేసేంత అందం మీది అంటూ కొందరు ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. మరి అన్షుల కు ఆ ఆలోచన ఉందా అనేది చూడాలి. బరువు ఆరోగ్యం కోసం కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. కనుక ఆమె ఏ ఉద్దేశ్యంతో బరువు తగ్గింది అనేది కాలమే నిర్ణయిస్తుంది.
Tags:    

Similar News