నిన్న నాని 28వ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. నేడు సినిమా దర్శకుడు మరియు హీరోయిన్ విషయమై క్లారిటీ ఇచ్చారు. బ్రోచేవారు ఎవరురా చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ ముద్దుగుమ్మ నజ్రియా నటించబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు వివేక్ ఆత్రేయా చేసిన రెండు సినిమాలు కూడా విభిన్నమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాకు కూడా విభిన్నమైన టైటిల్ ను ఆయన ఫిక్స చేసినట్లుగా తెలుస్తుంది.
సినిమా ప్రకటన చేసిన సమయంలో నేడు దర్శకుడు హీరోయిన్ ను అనౌన్స్ చేసే సమయంలో కూడా అంటే... అనే పదంను ఎక్కువగా వాడుతున్నారు. అదే టైటిల్ హింట్. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు 'అంటే సుందరానికి..' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. సుందరానికి తొందర ఎక్కువ అనే డైలాగ్ బాగా ఫేమస్. ఆ డైలాగ్ నుండే ఈ సినిమా టైటిల్ ను ఎంపిక చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
ఈనెల 21న టైటిల్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలోనే పట్టాలు ఎక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. మైత్రి మూవీ మేకర్స్ లో నాని చేసిన నాని గ్యాంగ్ లీడర్ సినిమా పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఈసారి అంతకు మించి అన్నట్లుగా సినిమా ఉంటుందన్నట్లుగా మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారట.