ఫన్.. రొమాన్స్ మేళవించి ప్రతి ఫ్రేమ్ లో ఎంటర్ టైన్ మెంట్ తో మిడిల్ క్లాస్ కథలను గ్రిప్పింగ్ గా తెరపై వండి వారిస్తే బంపర్ హిట్లు కొట్టడం అంత కష్టమేమీ కాదని టాలీవుడ్ లో చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు అదే జానర్ లో వస్తోంది నాని సినిమా. అంటే సుందరానికి అనే టైటిల్ లోనే బోలెడంత ఫన్ దాగి ఉంది. నాని బాడీ లాంగ్వేజ్ కి తగ్గ టైటిల్ కుదిరిందని ప్రశంసలు దక్కాయి.
ఇక ఈ మూవీ ఫోటోలు వీడియోలు ప్రతిదీ యూత్ ని ఫ్యామిలీ ఆడియెన్ ని ఆకర్షించాయి. తాజాగా సెన్సార్ ముంగిట ఉంది ఈ సినిమా. అంటే సుందరానికి సుదీర్ఘ రన్ టైమ్ తో ఉంటుందని సమాచారం. మూవీ చివరి కట్ దాదాపు 3 గంటల రన్ టైమ్ ను కలిగి ఉంటుందట. ఇది మరీ లెంగ్తీ అన్న గుసగుస వినిపిస్తోంది.
అంటే సుందరానికి కామెడీ ఎంటర్ టైనర్. ఈ జానర్ నిజానికి సాధారణంగా తక్కువ రన్ టైమ్ ని కలిగి ఉండాలి. కానీ సుందరానికి మేకర్స్ మూస పద్ధతిని బ్రేక్ చేసి సినిమా కోసం 3 గంటల రన్ టైమ్ ని లాక్ చేస్తారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే అంతసేపూ సీట్ అంచుపై కూచుని నవ్వుకునేంత గ్రిప్పింగ్ గా కంటెంట్ వర్కవుట్ అయ్యిందా లేదా? అన్నదే అసలు పాయింట్. దీనికి సంబంధించి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ఈ చిత్రంలో నాని సరసన మలయాళీ బ్యూటీ నజ్రియా నజీమ్ నాయికగా నటించింది. గతంలో బ్రోచేవారెవరురాతో హిట్ అందించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రూడ్ బూతు కామెడీ కాకుండా క్లాసిక్ టచ్ తో ఫన్ ని కామెడీని సృష్టించడం వివేక్ ఆత్రేయ ప్రత్యేకత. అది నానీ సినిమాకి ప్లస్ కానుందని టాక్.
రోలర్ కోస్టర్ అన్నారు మైత్రి వారు!
వరుస విజయాలతో జోరు మీదున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. మూవీ విజయంపై మైత్రి సంస్థ తొలి నుంచి ధీమాగా ఉంది. ''ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రమిది..అని టీమ్ ప్రకటించింది. నూతన సంవత్సరం సందర్భంగా అంటే సుందరానికి ఫస్ట్ లుక్ విడుదల కాగా అద్భుత స్పందన వచ్చింది.
నాని తన విలక్షణమైన ఫన్నీ లుక్ తో ఆశ్చర్యపరిచాడు. 'కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్' అనేది సినిమాలో అతని పాత్ర పేరు. ఈ చిత్రంతో నజ్రియా నజీమ్ ఫహద్ తెలుగులో అడుగుపెడుతోంది. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్ కాగా.. నికేత్ బొమ్మి కెమెరా వర్క్ అందిస్తున్నారు. నదియా- హర్షవర్ధన్ - రాహుల్ రామకృష్ణ- సుహాస్ తదితరులు నటించారు. నవీన్ యెర్నేని - రవిశంకర్ వై నిర్మాతలు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.