తెలుగులో చేసిన తన తొలి రెండు సినిమాలు ‘మజ్ను’.. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’లో కొంచెం పద్ధతిగానే కనిపించింది మలయాళ భామ అను ఇమ్మాన్యుయెల్. ఆ సినిమాల ప్రమోషన్లలో కూడా అను ట్రెడిషనల్ గానే దర్శనమిచ్చింది. కానీ ఈ మధ్య ఆమెకు ఒకటికి రెండు పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశాలొచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్నాతవాసి’.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’ల్లో ఆమే హీరోయిన్.
ఇలాంటి పెద్ద ఛాన్సులొచ్చినపుడే తనలోని గ్లామర్ కోణాన్ని మరింతగా బయటపెడుతూ కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లుంది అను. ఈ మధ్య ఆమె ఎక్కడా పబ్లిక్ లో కనిపించినా హాట్ హాట్ గానే ఉంటోంది. ఆ మధ్య ‘ఆక్సిజన్’ ప్రమోషన్లకు వచ్చినపుడు ఎంత హాట్ గా తయారైందో తెలిసిందే. తాజాగా ఒక మొబైల్ స్టోర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన అను.. క్లీవేజ్ షోతో మతులు పోగొట్టేసింది. వరుసగా అను గ్లామర్ షోలు చూస్తుంటే తెరపై అందాల ప్రదర్శనకు తనకేమాత్రం అభ్యంతరం లేదని చెప్పకనే చెబుతున్నట్లుంది. మరి దర్శక నిర్మాతలు ఈ విషయం గమనిస్తున్నారా?