పవన్ - త్రివిక్రమ్ లను చూసి ఒప్పుకోలేదు

Update: 2018-09-08 08:51 GMT
పవన్ ఫ్యాన్స్ ఎంత మర్చిపోదామని ట్రై చేసినా అంత సులభంగా వదిలిపోని చేదు జ్ఞాపకం అజ్ఞాతవాసి. విపరీతమైన హైప్ తో విడుదలై అంతకు పదింతలు దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న ఈ మూవీని సాధ్యమైనంత వరకు గుర్తు చేసుకోకుండా ఉండడానికే ఇష్టపడతారు ఫ్యాన్స్. కానీ ఏదో ఒక రూపంలో పలకరిస్తూనే ఉంటుంది. తాజాగా అను ఇమ్మానియేల్ అజ్ఞాతవాసి తాలూకు జ్ఞాపకాలు పంచుకుంది. శైలజారెడ్డి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అను మీడియాతో ఇంటరాక్షన్ సందర్భంగా పవన్ సినిమా గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. పవన్ త్రివిక్రమ్ పేర్లను చూసి తాను అది ఒప్పుకోలేదని కథ పూర్తిగా విన్నాక అత్తారింటికి దారేదిలో ప్రణీత టైపు పాత్రా అని అడిగి క్లారిటీ తీసుకుని ఓకే చేసానని చెప్పింది. అంత మంచి కాంబో సినిమా ప్రేక్షకులను నిరాశపరుస్తుందని ఏ మాత్రం ఊహించినలేదని చెప్పిన అను ఇప్పటికీ అది షాక్ గానే ఉందట.

అను చెప్పిన మాటల్లో కొంత నిజం ఉన్నప్పటికీ అజ్ఞాతవాసిలో ముందు నుంచి కీర్తి సురేష్ నే హీరోయిన్ గా హై లైట్ చేసుకుంటూ వచ్చారు. అనుకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఉన్న ఒకే ఒక్క మంచి పాట బయటికొచ్చి చూస్తే తన మీదే షూట్ చేసారు. కాకపోతే ఆ పాత్ర స్వభావం దాన్ని నడిపించిన తీరు పేలవంగా ఉండటంతో త్రివిక్రమ్ కే కాదు అది అనుకి కూడా మైనస్ గా నిలిచింది. అందులో సిగరెట్ తాగుతూ వాష్ రూమ్ లో ఇచ్చిన అను ఇంట్రడక్షన్ ఎవరూ మర్చిపోలేరు. అందుకే శైలజారెడ్డి అల్లుడుకి దానికి సంబంధం లేకపోయినా మీడియా అడగటంతో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళక తప్పలేదు అనుకు. ఈ ఏడాది చేసిన అజ్ఞాతవాసితో పాటు నా పేరు సూర్య తీవ్రంగా నిరాశ పరిచిన నేపథ్యంలో ఆశలన్నీ 13న రాబోతున్న శైలజారెడ్డి మీదే పెట్టుకుంది. చూద్దాం.
Tags:    

Similar News