మలయాళీ కుట్టి అను ఇమాన్యుయేల్.. క్రేజీ ప్రాజెక్టులు ఒడిసిపట్టుకోవడంలో దిట్ట. ఈ అమ్మడి స్పీడ్ కి స్టార్ హీరోయిన్లు కూడా షాక్ తినేస్తున్నారు. నానితో మజ్ను అంటూ ఓ యావరేజ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త అంటూ రాజ్ తరుణ్ తో సినిమా చేసింది.
ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలో ఎంపికకావడం ఆశ్చర్యం కలిగించింది. అజ్ఞాతవాసి మూవీలో ఓ హీరోయిన్ గా నటించిన ఇమాన్యుయేల్.. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే.. అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్యలో కూడా ఛాన్స్ పట్టేసింది. ఇప్పుడీ రెండు సినిమాలు రిలీజ్ అయిపోయాయి. పవర్ స్టార్ మూవీ అజ్ఞాతవాసి మూవీ గురించి కానీ.. అందులో అను రోల్ గురించి కానీ.. చెప్పుకోడానికి పెద్దగా ఏమీ లేవు. చెప్పుకున్నా దండగే. దీంతో తన మరుసటి చిత్రం నా పేరు సూర్యపై చాలానే హోప్స్ పెట్టుకుంది ఈ బ్యూటీ.
నా పేరు సూర్య కూడా థియేటర్లలోకి వచ్చింది. హానెస్ట్ అటెంప్ట్ అంటూ మేకర్స్ తో పాటు హీరో చెబుతున్న మాట నిజమే అని.. సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. కథకు మాత్రమే ఫిక్స్ అయ్యి తెరకెక్కించిన తీరు ప్రశంసనీయం. ఈ సినిమా హిట్టు అనిపించుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ జనాలు చెబుతున్నారు కానీ.. ఈ సినిమా ఒకవేళ హిట్ అయినా.. అనుకు ఏం దక్కుతుందనేది పాయింట్. అందాల ఆరబోతలో తక్కువేమీ చేయలేదు కానీ.. అవేవీ ఆడియన్స్ లో రిజిస్టర్ కాలేదు. పూర్తిగా బన్నీ వన్ మ్యాన్ షో అయిపోయింది.
ఇలాంటి రోల్స్ తో కెరీర్ ను గాడిలో పెట్టేసుకుని.. స్టార్ హీరోయిన్ అయిపోవాలని.. అనిపించుకోవాలని అనుకుంటే మాత్రం అసలు అసాధ్యమైన విషయం అని అను ఇమాన్యుయేల్ అర్ధం చేసుకోవాల్సి ఉంది. ఇకనైనా తన రోల్స్ ఎంపికలో జాగ్రత్త పాటించకపోతే.. షార్ట్ టెర్మ్ వండర్ అని కొంతకాలం తర్వాత అను గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇకనైనా కాస్త జాగ్రత్తపడు అనూ!