ఫోటో స్టోరి: తట్టుకోవడం కష్టమే

Update: 2017-08-26 08:01 GMT
ఇప్పుడు మన టాలీవుడ్ ను డామినేట్ చేస్తున్న హీరోయిన్లలో మలయాళీ ముద్దుగుమ్మలు చాలామందే ఉన్నారు. కీర్తి సురేష్‌ నుండి అను ఎమ్మానుయేల్ వరకు ఈ వార్ వన్ సైడ్ అయిపోయింది. అయితే వీరిలో చాలామంది హోమ్లీ లుక్స్ కే ప్రాధాన్యం ఇస్తుంటే ఇప్పుడు అనూ ఎమ్మానుయేల్ మాత్రం తన అందాల మోతతో దృడమైన మనస్సులను కూడా ఇట్టే కరిగించేస్తోంది.

అమెరికా నుండి వచ్చిన ఈ మలయాళీ ఎన్నారై ఇప్పుడు ఘాటు ఫోటోషూట్లతో మతి పోగొడుతోందనే చెప్పాలి. ఎందుకంటే అమ్మడు ఈ మధ్యకాలంలో తన లోదుస్తులు కనిపించేలా షూట్లు చేస్తూ.. బ్రాబోయ్ అనిపించేస్తోంది. అదిగో అక్కడ చూడండి.. క్లీవేజ్ అందాలతో కవ్వించే సోకులను దారబోస్తూ అను ఎలా కవ్విస్తోందో. ఈ రేంజులో రెచ్చిపోతూ సినిమాల్లో కూడా అదే తరహాలో అదరగొట్టేయాలని చూస్తోందట. అందుకే పవన్ కళ్యాణ్‌ త్రివిక్రమ్ సినిమాలో అమ్మడు బాగానే రెచ్చిపోయందని టాక్ వినబడుతోంది.

ఇకపోతే పవన్ కళ్యాణ్‌ తో సినిమా తరువాత అమ్మడు అల్లు అర్జున్ తో 'నా పేరు సూర్య' సినిమా చేస్తోంది. ఈ సినిమాలో కూడా అమ్మడు తన గ్లామర్ సైడ్ ను తెలుగు ఆడియన్స్ కు పరిచయం చెయ్యడానికీ రెడీ అయిపోయిందట. ఈ రేంజులో అందాల తాకిడి అంటే తట్టుకోవడం కష్టమే.
Tags:    

Similar News