ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇటీవల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును కలిశాడు. స్పెషల్ ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ లోని ఆమె ఇంటికి వచ్చిన అనుపమ్.. సింధు సాధించిన విజయాలు - మెడల్స్ - ట్రోఫీలు చూసి అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని నటుడు ట్విట్టర్ లో వెల్లడించారు.
సింధు ఇంట్లో ట్రోఫీలను చూపిస్తూ అనుపమ్ తన ట్విట్టర్ లో ఓ వీడియోని షేర్ చేసాడు. అండర్-13 టోర్నమెంట్లు - ఒలింపిక్స్ లో ఆమె గెలిచిన ట్రోఫీల నుండి ప్రారంభించి.. సింధు తన అన్ని విజయాలు మరియు బహుమతుల గురించి సింధూను అడిగి తెలుసుకున్నాడు.
27 ఏళ్ల బ్యాడ్మింటన్ క్రీడాకారిణిని ప్రశంసిస్తూ.. ఇలాంటి ఛాంపియన్ ను కలిసే అవకాశం లభించడం ఎంతో సంతోషంగా ఉందని అనుపమ్ పేర్కొన్నాడు. ''వన్ అండ్ ఓన్లీ ఛాంపియన్. ఈ గోడను చూడండి. నా గోడపై ఉన్న అవార్డ్స్ చూసి నేను గర్వపడేవాడికి. కానీ ఇక్కడ చూడండి. చాలా అద్భుతమైనది. ఓ మై గాడ్.. ఇక్కడ అసలు ఖాళీ లేదు'' అని అనుపమ్ మాట్లాడడం వీడియోలో కనిపిస్తుంది.
ట్రోఫీలు మరియు పతకాల కోసం స్థలం తక్కువగా ఉన్నందున మరొక స్థలం చూస్తున్నానని సింధు తండ్రి తనతో చెప్పినట్లు అనుపమ్ తెలిపారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం తన సేవలకు గుర్తుగా అందించిన అర్జున అవార్డ్ గురించి సింధు మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న పిన్న వయస్కురాలు తానేనని తెలిపింది.
అలానే తన తండ్రికి వచ్చిన అర్జున అవార్డ్ గురించి ప్రస్తావిస్తూ.. రెండు వేర్వేరు క్రీడలలో తల్లీకూతుర్లకు అర్జున రావడం విశేషమని సింధూ చెప్పింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఇంటిని సందర్శించడం 'విశేషంగా' భావించిన అనుపమ్.. ఆమె ఇంట్లో అలంకరించిన టోపీలు చూసి ఎలా మైమరచిపోయాడో ట్వీట్ లో రాసుకొచ్చాడు.
"ఇది అద్భుతంగా ఉంది.. ఇటీవల నాకు ఛాంపియన్ పివిసింధు ఇంటికి వెళ్లే అవకాశం లభించింది. 8 సంవత్సరాల వయస్సు నుండి ఆమె సాధించిన విజయాల గురించి నాకు చాలా వినయంగా వివరించింది. ఆమె అవార్డులు, ట్రోఫీలు & వినయంతో నేను పూర్తిగా బౌల్డ్ అయ్యాను. సింధు మన భారతదేశపు కుమార్తె.. మన గౌరవం. ఆమె మనకు ప్రేరణ కలిగించే హీరో. జై హో.. జై హింద్'' అని అనుపమ్ ట్వీట్ లో తెలిపారు. సింధూ తో ఉన్న ఓ ఫోటోని పంచుకున్నారు.
సింధూ సైతం ఇన్‌స్టాగ్రామ్ లో అనుపమ్ తో సమావేశానికి సంబంధించిన ఫోటోని పంచుకుంటూ ''ఇండియన్ సినిమా ఆల్ టైమ్ గ్రేట్ యాక్టర్స్ లో ఒకరితో సమయం గడిపే అదృష్టం కలిగింది. నవ్వులు, జ్ఞాపకాలు మరియు నాణ్యమైన సంభాషణ.. ఎంత గౌరవం'' అని రాసుకొచ్చింది.
ఇక అనుపమ్ ఖేర్ విషయానికొస్తే.. ఇటీవలి ఎపిక్ బ్లాక్ బస్టర్ 'కార్తికేయ 2' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా అనుపమ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి చేసినట్లు చిత్ర బృందం తెలిపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

AMAZING: I had the privilege of visiting CHAMP @Pvsindhu1’s home.She very humbly gave me a tour of her achievements, awards and trophies! Right from the age of 8!