ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ స్పై థ్రిల్లర్ స్పైడర్ మూవీ రిలీజ్ సందర్భంగా మహేష్ తెలుగు - తమిళ్ మీడియాలకు బాగానే ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈసారి ఎప్పుడూ లేనివిధంగా బాలీవుడ్ క్రిటిక్స్ దృష్టి కూడా మహేష్ మీద పడింది. బాలీవుడ్ లో ఫేమస్ ఫిలిం క్రిటిక్ అయిన అనుపమ చోప్రా ఇంతవరకు ఆమె తెలుగులో రెండంటే రెండు ఇంటర్వ్యూలు మాత్రమే తీసుకుంది. మొదటిసారి సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కు ముందు పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా షూటింగ్ స్పాటులో కలిసి సినిమాతో పాటు పవర్ స్టార్ పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నలు అడిగింది. మళ్లీ ఇన్నాళ్లకు ఓ తెలుగు హీరోను ఇంటర్వ్యూ చేసింది.
స్పైడర్ విశేషాలు తెలుసుకునేందుకు రీసెంట్ గా అనుపమ చోప్రా మహేష్ ను కలిసి మాట్లాడింది. ఇంటర్వ్యూ పూర్తయ్యాక మహేష్ బాబు ఆటిట్యూడ్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఆ విషయాన్ని షేర్ చేసింది. ‘‘మహేష్ తో చేసిన ఛాట్ గొప్ప ఆనందం కలిగించింది. బ్యాడ్ స్క్రిప్టులు ఎంచుకోవడం.. ఫేమ్ పోగొట్టుకోవడం గురించి కూడా అతడు చాలా నిజాయతీగా మాట్లాడాడు. ఇంకా స్పైడర్ గురించి కూడా విశేషాలు చెప్పాడు’’ అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టింది. దీంతో మహేష్ ఏం కొత్త విశేషాలు చెప్పాడనే దానిపై అభిమానుల్లోనూ క్యూరియాసిటీ పెరిగింది.
సాధారణంగా టాలీవుడ్ లో కొత్త సినిమా రిలీజుల గురించి బాలీవుడ్ మీడియా పెద్దగా పట్టించుకోదు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే అప్పుడు ఆ సినిమా గురించి ఆరా తీయడం తప్ప సినిమా ముందు రిలీజ్ హడావుడిని అక్కడి మీడియా పీపుల్ లైట్ తీసుకుంటారు. ఇప్పుడిప్పుడు ఈ ట్రెండ్ మారుతోంది. మన సినిమాలకు పెరుగుతున్న క్రేజ్ తో ఇప్పుడు అక్కడి మీడియా కూడా సౌత్ వైపు తొంగిచూస్తోంది.