తొలిసారి రిపీట్ చేస్తున్న అనుపమ

Update: 2018-01-29 04:42 GMT
పుట్టి పెరిగింది కేరళనే అయినా అచ్చ తెలుగు అందానికి మారుపేరు అన్నట్టుగా ఉంటుంది మళయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. శతమానం భవతి సినిమాలో ముగ్ధ మనోహరంగా కనిపించిన అనుపమ అందానికి టాలీవుడ్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు. దీంతో ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇంతవరకు అనుపమ తెలుగులో నాలుగు సినిమాల్లో నలుగురు యంగ్ హీరోలతో నటించింది. ఒకసారి నటించిన హీరోతో మళ్లీ తిరిగి నటించలేదు.

రీసెంట్ గా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కలిసి ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో హీరోయిన్ గా నటించింది అనుపమ. రామ్ తరవాత నటించబోయే సినిమాలోనూ ఆమెనే హీరోయిన్ గా తీసుకోవడానికి డిసైడయ్యారనేది లేటెస్ట్ టాక్. దిల్ రాజు ప్రొడక్షన్ లో తొలిసారి రామ్ నటించబోయే ఈ సినిమాకు నేను లోకల్ ఫేం డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ది పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో అనుపమ దానికి పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఆమెను సంప్రదించారని తెలుస్తోంది. రామ్ - అనుపమల కాంబినేషన్ లో వచ్చిన ఉన్నది ఒకటే జిందగీ భారీ హిట్ కాకపోయినా ఈ జంట బావుందనే రావడంతో యూనిట్ అనుపమ అయితే బెటరని ఫీలవుతోందని టాక్.

అనుపమ పరమేశ్వరన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన శతమానం భవతి సినిమాకు ప్రొడ్యూసర్ దిల్ రాజునే. తనకు పేరు తెచ్చినదే కాకుండా టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ఆఫర్ కావడంతో ఈ సినిమాలో నటించేందుకు ఉత్సాహంగానే ఉందని తెలుస్తోంది. ఈ సినిమా పట్టాలెక్కితే ఒకసారి పనిచేసేన హీరో నిర్మాతతో కాంబినేషన్ రిపీట్ చేయడం అనుపమ కెరీర్ లో మొదటిసారి అవుతుంది.  


Tags:    

Similar News