వైరల్.. అనుపమ మొదటి వ్లాగ్ వీడియో

Update: 2022-11-20 11:13 GMT
క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఎలా కనిపించనా అందమే అనే విధంగా ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ ఉంటుంది. ఇక ఆమెకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. అనుపమ పరమేశ్వరన్ ఇటీవల కాలంలో అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న కొన్ని ఫోటోలు ఊహించిన విధంగా ఉన్నాయి.

అనుపమ మెల్లగా గ్లామర్ డోస్ కూడా పెంచుతుంది. అయితే ఎక్కడా కూడా వల్గర్ గా లేకుండా ఆమె తన గ్లామర్ ను హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇక రీసెంట్ గా మొదటిసారి యూట్యూబ్లో ఒక వ్లాగ్ వీడియో చేయడం వైరల్ అయింది. ప్రస్తుతం చాలామంది హీరోయిన్స్ సోషల్ మీడియా ద్వారా జనాలకు మరింత దగ్గరవుతున్నారు. అంతేకాకుండా ఆ రూట్ లోనే మంచి ఆదాయం కూడా సొంతం చేసుకుంటున్నారు.

ప్రస్తుతం చాలామంది హీరోయిన్ ఇన్ స్టా ద్వారా ప్రతి ఏడాది 50 లక్షల పైగానే ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. అంటే అక్కడ బిజినెస్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే యూట్యూబ్ ద్వారా కూడా కొంతమంది సెలబ్రిటీలు వారికి నచ్చిన కంటెంట్ ను పోస్ట్ చేస్తూ మంచి క్రేజ్ అయితే అందుకుంటున్నారు. అయితే ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కూడా అదే తరహాలో వ్లాగ్ వీడియో చేస్తూ యూట్యూబ్లో ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది.

డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలను చేసే అనుపమ ఈ ఈమధ్య కార్తికేయ 2 సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ తోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఫాలోవర్ల సంఖ్యను కూడా పెంచుకుంటుంది. ఇక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన అమ్మడు మొదటి వ్లాగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఇటీవల ఒక సినిమా సాంగ్స్ కోసం పోలాండ్ వెళ్ళిన అనుపమ అక్కడ షూటింగ్ బ్రేక్ లో పోలాండ్ అందాలను అక్కడ వాతావరణాన్ని తన కెమెరాలు బంధించింది. ఇక వీడియోను అమ్మడు తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసుకొని వైరల్ అయ్యేలా చేసింది.


Full View
Tags:    

Similar News