44 ఏళ్ల డైరక్టర్‌.. 22 ఏళ్ల స్టూడెంట్‌ తో..

Update: 2015-12-18 13:30 GMT
బ్లాక్ ఫ్రై డే  దేవ్ -డి - గ్యాంగ్స్ ఆఫ్ వ‌సేపూర్‌ - బాంబే వెల్వెట్ .. ఈ సినిమాల పేర్లు విన‌గానే గుర్తుకొచ్చే పేరు అనురాగ్ క‌శ్య‌ప్‌. ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ యూనిక్ ఐడెంటిటీతో బాలీవుడ్‌ లో కెరీర్ ని సాగిస్తున్నాడు. ఓ వైపు స్టార్ డైరెక్ట‌ర్‌గా కెరీర్‌ ని సాగిస్తూనే వ్య‌క్తిగ‌త జీవితంలో ఒడిదుడుకుల విష‌యంలో అబాసుపాలవ్వ‌డం ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ‌కొస్తూనే ఉంది. న‌టి క‌ల్కి కొచ్లిన్‌ని పెళ్లాడి కొన్నేళ్ల‌పాటు కాపురం చేశాడు. అయితే మ‌ధ్య‌లో క‌ల‌త‌లు వ‌చ్చి ఈ ఇద్ద‌రూ ఎవ‌రి దారి వారు చూసుకున్నారు.

అయితే ఇటీవ‌లి కాలంలో సింగిల్ స్టాట‌స్ నుంచి బైట‌ప‌డ్డా అంటూ క‌ల‌క‌లం రేపాడు అనురాగ్ క‌శ్య‌ప్‌. మ్యాటర్‌ ఏంటా అని తొంగి చూస్తే మనోడు 22 ఏళ్ల మాస్ క‌మ్యూనికేష‌న్ స్టూడెంట్‌ తో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడట. రిలేష‌న్‌ షిప్‌ లో ఉన్నా అంటూ ఇన్‌ డైరెక్టుగా చెప్పకపోయినా.. ఆమెతో మనోడు వినోదాలకూ విందులకు అటెండ్‌ అవుతుంటే మ్యాటర్‌ తెలిసిపోతోంది. అమ్మాయి పేరు శుభ్ర శెట్టి. సెయింట్ జేవియ‌ర్ కాలేజ్‌ లో మాస్‌ కమ్యూనికేషన్‌ చదివి.. మనోడి కంపెనీ ఫాంటమ్‌ ఫిలింస్‌ లో పనిచేస్తోంది.

ఇది విన‌డానికి కాసింత షాకింగ్‌నే ఉన్నా అత‌డు ఇంత కాన్ఫిడెంట్‌ గా - ఓపెన్‌ గా ఈ సంగ‌తిని చెప్పేయ‌డం సినిమా ల‌వ‌ర్స్‌ లో చ‌ర్చ‌కొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రూ సినిమాల‌కు ప‌నిచేస్తూనే రొమాన్సింగ్ అన్నమాట.  43 వ‌య‌సున్న డైరెక్ట‌ర్‌ గారితో 22 ఏళ్ల పాపాయి ల‌వ్‌ స్టోరీ అన్న‌మాట‌! స‌గానికి స‌గం వ‌య‌సు తేడా ఉంది మ‌రి. బాలీవుడ్ ల‌వ్‌ స్టోరీల‌న్నీ ఇంచుమించు హాలీవుడ్ సినిమాల్లానే ఉంటాయి మ‌రి!
Tags:    

Similar News