ఆన్ లైన్ బెదిరింపులకు భయపడి ఏకంగా సామాజిక మాధ్యమాల్లోంచి వైదొలగడమా? ఇది షేమ్ అని అనిపిస్తోందా? అయితే అలాంటి బెదిరింపులకు సెలబ్రిటీలు బెంబేలెత్తుతున్న ఘటనలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఏకంగా ట్విట్టర్.. ఎఫ్‌బీ ఖాతాల్ని మూసేసి సైలెంట్ అయిపోతున్నారు కొందరైతే. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సైతం సామాజిక జనుల దుర్భాష బెదిరింపులకు భయపడిపోయారు. వెంటనే ట్విట్టర్ ఖాతా నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించి క్లోజ్ చేసేశారు.
అయితే ఆయన అంతగా భయపడడానికి కారణమేంటి? అంటే.. ఇప్పటికే తన తల్లిదండ్రులకు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. అలాగే కూతురు పైనా తీవ్రమైన వ్యాఖ్యాలు కనిపించాయట. వాళ్లకు ప్రమాదం పొంచి ఉందన్న భయంతోనే ఆయన ట్విట్టర్ నుంచి వైదొలిగారు. ఇప్పుడంతా దుండగుల రాజ్యం నడుస్తోంది. వాళ్లదే హవా. చెప్పుకోలేని పరిస్థితిలో ఇలా చేస్తున్నా.. అని తీవ్ర ఆవేదనకు గురయ్యారు అనురాగ్.
భారతదేశం ఎంతగా అభివృద్ధి చెందుతోందో? ఇకపైనా ఇలానే ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని పరోక్షంగా సిస్టమ్ ని ఎత్తి చూపారు అనురాగ్. మనసులో ఉన్నది ఎలాంటి భయం లేకుండా మాట్లాడే అవకాశం లేనప్పుడు మాట్లాడను అని అన్నారు. అయితే అనురాగ్ పై నెటిజనుల ఆగ్రహానికి కారణమేంటి? అంటే ఆయన గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని.. మోదీ విధానాల్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగానూ కలకలం రేపుతున్నాయి. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు వ్యవహారాన్ని అనురాగ్ ఆక్షేపించారు. ఏక వ్యక్తి నిర్ణయం కోట్లాది మంది ప్రజల జీవితాల్ని ప్రభావితం చేస్తోందని వ్యాఖ్యానించారు. దీంతో అతడికి ట్విట్టర్ లో థ్రెట్ స్టార్టయ్యింది. అది పీక్స్ కి చేరుకోవడంతో ఇక తట్టుకోలేని సన్నివేశంలో అనురాగ్ ట్విట్టర్ నుంచి వైదొలిగారన్నమాట.