ఈ తరం బాలీవుడ్ దర్శకుల్లో చాలా విలక్షణమైన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనురాగ్ కశ్యప్. వర్మ దగ్గర ‘సత్య’ సినిమాకు పనిచేసి.. ఆ తర్వాత బ్లాక్ ఫ్రైడే.. దేవ్-డి.. గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్.. ఎ గర్ల్ ఇన్ ద ఎల్లో బూట్స్.. బాంబే వెల్వెట్ లాంటి వైవిధ్యమైన సినిమాలతో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు అనురాగ్. అతడి చివరి సినిమా ‘బాంబే వెల్వెట్’ కమర్షియల్ గా డిజాస్టర్ అయినా.. విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. ఇప్పుడు అనురాగ్ నుంచి రాబోయే తర్వాతి సినిమా కోసం బాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అతను ‘రామన్ రాఘవ్ 2.0’ అనే మాఫియా బ్యాగ్రౌండ్ ఉన్న సినిమాతో రాబోతున్నాడు.
నవాజుద్దీన్ సిద్ధిఖి లాంటి గ్రేట్ ఆర్టిస్ట్ ఈ సినిమాలో లీడ్ రోల్ చేశాడు. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజే రిలీజైంది. అనురాగ్ కశ్యప్ సినిమాల్లో ఎప్పుడూ కనిపించే ఇంటెన్సిటీ ఈ పోస్టర్లోనూ కనిపిస్తోంది. అనురాగ్-నవాజుద్దీన్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’ సిరీస్ సెన్సేషనల్ అయింది. ముఖ్యంగా రెండో భాగంలో నవాజుద్దీన్ టాలెంటుని అద్భుతంగా వినియోగించుకున్నాడు కశ్యప్. ఇప్పుడు వీళ్లిద్దరూ మరోసారి జత కట్టిన సినిమా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది ఓ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా. వర్మ సినిమా ‘వీరప్పన్’ రిలీజయ్యే మే 27నే ఈ సినిమా కూడా విడుదల కాబోతోంది. మరి గురుశిష్యుల్లో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారో చూడాలి.