ఇదేంటి ఇలా అనేసారు అని ఆశ్చర్యపోకండి. ఇది మేమన్న మాట కాదు. భాగమతి సినిమా నిర్మాతలు స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్. కాకపోతే ఈ నిబంధన ఒక్క షోకు మాత్రమే. అది కూడా ప్రస్తుతానికి మూడు కేంద్రాల్లోనే. ఇదంతా దేనికి అంటే భాగమతి విజయంలో కీలకంగా భావిస్తున్న మహిళా ప్రేక్షకులకు థాంక్స్ చెప్పేందుకు స్వయంగా అనుష్క థియేటర్ల వద్దకు రానుంది. వ్యక్తిగతంగా తన అబిమానులను కలుసుకుని కృతజ్ఞతలు చెప్పడమే కాదు వాళ్ళతో కూర్చుని కాసేపు సినిమాను ప్రత్యక్షంగా చూడబోతోంది. సూపర్ ఛాన్స్ అని మగ ఫాన్స్ సంబరపడేందుకు ఛాన్స్ లేకుండా కేవలం లేడి ఫాన్స్ కోసమే అని ప్రకటనలో ప్రత్యేకంగా చెప్పారు. సో ఆడ బ్యాచ్ ను పంపొచ్చు కాని మగాళ్ళ టీం మాత్రం ఇంట్లోనే ఉండాలి.
రేపు ఉదయం మొదలుకొని విజయవాడ - ఏలూరు - రాజమండ్రి థియేటర్లలో వరస షోలలో తన లేడీ ఫాన్స్ ని అనుష్క కలవబోతోంది. ఈ సంవత్సరం విడుదలైన సినిమాల్లో వసూళ్ళ పరంగా భారీ విజయం నమోదు చేసుకున్న తొలి చిత్రంగా అడుగులు వేస్తున్న భాగమతి ప్రమోషన్ ఇంకో వారం పాటు ఉధృతంగా కొనసాగిస్తే బ్లాక్ బస్టర్ గా మార్చవచ్చు అనేది నిర్మాతల ప్లాన్ లా కనిపిస్తోంది. ఇప్పటి దాకా 22 కోట్ల షేర్ రాబట్టి కేవలం తన ఇమేజ్ మీదే నడిపిస్తున్న అనుష్క దీనికి పూర్తి సహకారం అందిస్తోంది. అనుష్క గత కొన్నేళ్ళలో ఎన్నడు ప్రత్యేకంగా ఇలా సక్సెస్ టూర్ కోసం థియేటర్ల వద్దకు వచ్చిన దాఖలాలు లేవు.
అందుకే విపరీతమైన రద్దీతో అభిమానుల తాకిడి కట్టడి చేయటం కష్టం అవుతుందనే ఉద్దేశంతోనే నిర్మాతలు చాలా తెలివిగా ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్న హీరొయిన్లు ఏదైనా మొబైల్ షో రూమ్ ఓపెనింగ్ కోసం వచ్చినా రోడ్లు బ్లాక్ అవుతున్నాయి. అలాంటిది ఇంత ఇమేజ్ ఉన్న అనుష్క వస్తోంది అంటే మనవాళ్ళు ఊరికే ఉంటారా. అందుకే మగాళ్ళకు నో ఎంట్రీ, ఆడవాళ్లకు మాత్రమే అని బోర్డ్ పెట్టేసి భాగమతిని పిలిస్తున్నారు. కాదేది ప్రమోషన్ కు అనర్హం. కాదనగలరా.