వెండితెరపై అందాల చందమామ అనుష్క .. ఆ మాట కొస్తే చంద్రుడికైనా మచ్చ ఉంది కానీ మా అనుష్క మచ్చలేని చందమామ అంటారు అభిమానులు. అనుష్క కనుముక్కుతీరు ఈ తరంలో వేరే హీరోయిన్స్ ఎవరిలోనూ కనిపించదు. ఎత్తు .. అందుకు తగిన అందమైన పర్సనాలిటీతో, జానపద పౌరాణికాల చిత్రాలకి సైతం సరిగ్గా సరిపోయే రూపం అనుష్క సొంతం. ఒక 'అరుంధతి' .. 'బాహుబాలి' .. 'రుద్రమదేవి' వంటి సినిమాలు అనుష్క ఖాతాలో చేరడానికి ఆమె రూపమే ప్రధానమైన కారణం.
అనుష్క అభినయాన్ని కూడా ఎక్కడా వంక బెట్టలేం. బరువైన పాత్రలను కూడా ఆమె అద్భుతంగా ఆవిష్కరించింది. కథా భారాన్ని పూర్తిగా తన భుజాలపై వేసుకుని, విజయతీరాల వైపు నడిపించింది. అనుష్కలో ప్రధానమైన ఆకర్షణ ఆమె నవ్వు .. ఆమె నవ్విందంటే వేల వసంతాలు ఒక్కసారిగా వచ్చినట్టు .. కలువలన్నీ ఒక్కసారిగా విరిసినట్టు అనిపిస్తుంది. ఇక ఆమె మనసు కూడా మల్లెపూవులా సుకుమారమే. అందువల్లనేనేమో .. సాధారణమైన ప్రేక్షకుల్లోనే కాదు .. నటీనటుల్లోను ఆమెకి అభిమానులు ఉన్నారు.
తెలుగు .. తమిళ భాషల్లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా అనుష్క జోరు కొనసాగుతున్న సమయంలో, ఆమె 'సైజ్ జీరో' సినిమా చేసింది. ఈ సినిమాలోని పాత్ర కోసం ఆమె బాగా బరువు పెరిగే సాహసం చేసింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది .. అందుకు గుర్తుగా అనుష్క బరువు మాత్రం అలాగే ఉండిపోయింది. అప్పటి నుంచి ఆమె ఎంతగా కష్టపడినా పెద్దగా బరువు తగ్గలేకపోయింది. అందువలన కొంతకాలం పాటు ఆమె గెస్టు రోల్స్ లో కనిపిస్తూ వచ్చింది. పూర్తి స్థాయి సినిమాల్లో ఆమె బరువు పెరిగినట్టుగా కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చింది.
పెరిగిన బరువు కారణంగానే అనుష్క నిదానంగా సినిమాలు తగ్గించుకుంటూ వచ్చింది. 'సైజ్ జీరో' తరువాత అనుష్క కెరియర్ గ్రాఫ్ ను చూస్తే, ఆ ఒక్క సినిమా ఎంతపని చేసిందని అనిపించక మానదు. అనుష్క క్రేజ్ .. ఆమె ప్లేస్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఆ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. అందువలనే ఆమె సన్నబడాలనీ .. మళ్లీ తెరపై మెరవాలనే అభిమానులంతా ఆశిస్తున్నారు. మరి వాళ్ల ముచ్చట తీరుతుందో లేదో!