ఆ స్టెప్ ఏంటి అనుష్కా!?

Update: 2017-03-16 12:34 GMT
బాహుబలి2 ట్రైలర్ వచ్చేసింది. అనుకున్నట్లుగానే యూట్యూబ్ రికార్డులన్నిటినీ తిరగరాసేస్తోంది. ప్రేక్షకులు ఆశించిన స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా కట్ చేసిన ఈ 2నిమిషాల 25 సెకన్ల థియేట్రికల్ ట్రైలర్ లోని ప్రతీ ఫ్రేమ్ విజువల్ రిచ్ గా ఉంది. ఈ ట్రైలర్ లో ప్రభాస్.. రానా.. కట్టప్పలతో పాటు ఎక్కువ స్క్రీన్ స్పేస్ అనుష్కకు లభించింది. రాణిగా యుద్ధ సన్నివేశాల్లోను.. అమరేంద్ర బాహుబలి ప్రియురాలి పాత్రలోనూ కనిపించింది స్వీటీ.

ముందుగా అనుకున్నట్లుగానే అనుష్కను అత్యంత గ్లామరస్ గా చూపించాడు రాజమౌళి. ఆమె ప్రస్తుత లుక్ తో సంబంధం లేకుండా.. స్లిమ్ స్వీటీని ఆవిష్కరించాడు. అయితే.. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే.. ఇందులోని ఓ పాటలో అనుష్క వేసిన స్టెప్ గురించే. మామూలుగానే డ్యాన్స్ విషయంలో అనుష్క కాసింత వీక్. పైగా నిండైన పర్సనాలిటీ కావడంతో.. అంతగా మెలికలు తిరగడం కష్టమైన విషయం. కానీ పాటలో మాత్రం బక్కపలచని భామలకు కూడా అసాధ్యం అనిపించే ఓ స్టెప్ ను చూపించేశారు.

చూస్తుంటేనే ఇది గ్రాఫిక్స్ మహిమ అని అర్ధమైపోతోంది. అలాంటి స్టెప్ ను ట్రైలర్ లోనే చూపించేయడం అంటే.. అనుష్క కోసం గ్రాఫిక్స్ ను ఆశ్రయించినట్లు ఇన్ డైరెక్టుగా చెప్పేయడమే. కేవలం అనుష్క లుక్ కోసమే కాకుండా.. డ్యాన్స్ లకు కూడా జక్కన్న గ్రాఫిక్స్ ని ఉపయోగించేశాడన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News