టాలీవుడ్ లో సూపర్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన అనుష్క బాహుబలి సినిమా తర్వాత మరింత స్పీడ్ గా సినిమాలు చేస్తుందని... లేడీ ఓరియంటెడ్ సినిమాలతో లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ ను దక్కించుకుంటుందని అంతా భావిస్తే అనుష్క మాత్రం సినిమాలను చాలా లైట్ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆమె నుండి భాగమతి మరియు నిశబ్దం సినిమాలు మాత్రమే వచ్చాయి.
ఒక్కో సినిమాకు రెండు మూడు కోట్ల పారితోషికం తీసుకునేంత సత్తా.. క్రేజ్ ఉన్న అనుష్క అన్ని కోట్లను లైట్ తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ఆమె ఎలా ఉన్నా కూడా సినిమాలను నిర్మించేందుకు పెద్ద నిర్మాతలు ఎంతో మంది క్యూ కడతారు. కాని అనుష్క మాత్రం ఆచి తూచి సినిమాను ఎంపిక చేస్తుంది. కమిట్ అయిన సినిమాలకు కూడా డేట్లు అదుగో ఇదుగో అంటూ ఆలస్యం చేస్తుందట.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో పి మహేష్ దర్శకత్వంలో ఒక సినిమా కు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సినిమా గత ఏడాదిలోనే పట్టాలెక్కాల్సి ఉంది. స్క్రిప్ట్ వర్క్ కూడా ఎప్పుడో పూర్తి అవ్వాల్సి ఉంది. కాని అనుష్క సరిగా సమయం కేటాయించని కారణంగా ఆలస్యం అవుతూ వస్తుందట. యూవీ క్రియేషన్స్ వారికి అనుష్క తో సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా వారు కూడా ఆమెను బలవంతం చేయడం లేదు.
హీరోయిన్ గా అనుష్క ను వెండి తెరపై చూడాలని ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె మాత్రం గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులతో క్వాలిటీ టైమ్ ను స్పెండ్ చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఎట్టకేలకు వచ్చే నెల నుండి సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు ఓకే చెప్పిందని యూవీ క్రియేషన్స్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ఇదే సమయంలో సినిమాలోని ఆమె పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో అనుష్క అంతర్జాతీయ స్థాయి చెఫ్ గా కనిపించబోతుందట. ఆమె పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని.. ఇప్పటి వరకు అనుష్కని చూడని విధంగా చూస్తారంటూ మేకర్స్ చెబుతున్నారు. సినిమాలో జాతిరత్నం నవీన్ పొలిశెట్టి ఉండటం వల్ల సినిమా స్థాయి మరింతగా పెరుగుతోంది.
అనుష్క మరియు నవీన్ పొలిశెట్టి ల మద్య సంబంధం సినిమాలో ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇదే నెలలో ప్రారంభం కాబోతుంది. అనుష్క మరియు నవీన్ లేకుండా షూటింగ్ జరుగబోతుంది. వచ్చే నెలలో అనుష్క జాయిన్ అవ్వనున్నట్లుగా సమాచారం అందుతోంది. నవీన్ పొలిశెట్టి కూడా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడట.
ఈ ఏడాది చివరి వరకు సినిమా ను ముగించాలని.. ఆ వెంటనే విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అనుష్క తో యూవీ క్రియేషన్స్ వారు నిర్మించబోతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.