గత ఏడాది నిశబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క నిరాశ పర్చింది. ఆ సినిమా ఓటీటీ ద్వారా విడుదల అయ్యింది. థియేటర్లలో విడుదల అయ్యి ఉంటే భారీ వసూళ్లు వచ్చేవని మేకర్స్ చెబుతున్నా సినిమా మొత్తానికి అయితే ప్లాప్ గా మిగిలి పోయింది. అనుష్క నిశబ్దం తర్వాత చేయబోతున్న సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ అనుష్క సినిమాలు చేయక పోవడంకు కారణం ఆమె అధిక బరువు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిశబ్దంలో అనుష్క తగ్గినట్లుగా అనిపించింది. కాని అది గ్రాఫిక్స్ మాయాజాలం అని ఆ సినిమా ప్రమోషన్ సందర్బంగా అనుష్కను చూసిన వారికి అర్థం అయ్యింది.
గత మూడు నాలుగు సంవత్సరాలుగా అనుష్క తగ్గితే చూడాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. కాని అనుష్క మాత్రం బొద్దుగానే కనిపిస్తూ వస్తుంది. కాని ఇటీవల అనుష్క షేర్ చేసిన ఈ ఫొటో లో మాత్రం తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఎట్టకేలకు అనుష్క బరువు తగ్గినందుకు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి దేవసేన ఎట్టకేలకు బరువు తగ్గింది. ఇక వరుసగా సినిమాలు చేయడమే తరువాయి అంటున్నారు. అనుష్క కమిట్ అయితే చాలు కాని వరుసగా ఆమెకు ఆఫర్లు క్యూ కడతాయి. కాని అనుష్క మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది.
అనుష్క ఈ ఫొటోలో చార్లీ చాప్లిన్ ఫోజ్ ఇచ్చింది. తొంగి చూస్తూ మాస్క్ తీసి లైట్ స్మైల్ తో అదరగొట్టింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి అనుష్క న్యూ లుక్ ఆమె అభిమానులకు ఆనందం కలిగిస్తుంది. వచ్చే ఏడాదిలో అనుష్క నుండి సినిమా వస్తుందేమో చూడాలి. ఇప్పటి వరకు అనుష్క అధికారికంగా సినిమా షురూ అయితే చేసింది లేదు. కాని ఆమె తదుపరి సినిమా యూవీ క్రియేషన్స్ లో ఉంటుందని మాత్రం టాక్ వినిపిస్తుంది.