కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై చెప్పడంపై స్పందించిన భార్య అనుష్క

Update: 2021-09-17 15:30 GMT
టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం క్రీడావర్గాల్లో సంచలనమైంది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కోహ్లీ ధనాధన్ క్రికెట్ కెప్టెన్సీ పదవికి గుడ్ బై చెప్పబోతున్నాడు. అయితే వన్డేను మినహాయించి కేవలం టీ20ల నుంచే కోహ్లీ తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఐసీసీ మెగా ఈవెంట్లు అయిన చాంపియన్స్ ట్రోఫీ 2017, వన్డే వరల్డ్ కప్ 2019, వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఓడిపోయింది. ఈ మూడు కప్ లు గెలవలేక విఫలమైంది. ఇక ఐపీఎల్ లోనూ కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ ఇంతవరకు టైటిల్ గెలవలేకపోయింది. దీంతో టీ20 కెప్టెన్సీపై ప్రభావం చూపిందనే కోహ్లీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

కోహ్లీ నిర్ణయంపై చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోయారు. బీసీసీఐకి ఈ విషయం తెలిపిన తర్వాత కోహ్లీ సుధీర్ఘ లేఖను విడుదల చేశాడు. ఇక మాజీ క్రికెటర్లు సహా చాలా మంది కోహ్లీ నిర్ణయంపై స్పందించారు. కొందరు కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతించగా.. కొందరు వ్యతిరేకించారు. కోహ్లీని తీసేసి రోహిత్ శర్మను చేయాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే తన భర్త కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై ఆయన భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ స్పందించారు. కోహ్లీ రాసిన లేఖను షేర్ చేస్తూ కేవలం ‘లవ్ ఎమోజీ’ సింబల్ ను జత చేశారు. తన భర్త ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటారని.. అతడి నిర్ణయం నాకు సంతోషమేనని అనుష్క చెప్పకనే చెప్పింది.
Tags:    

Similar News