టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సెలబ్రెటీలు, అభిమానులు పెద్ద ఎత్తున కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. 33వ బర్త్ డే చేసుకుంటున్న విరాట్ కోహ్లీకి ఆయన భార్య అనుష్క చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అయ్యింది.
కోహ్లీ భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా కోహ్లీకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా విషెస్ తెలియజేసింది. కోహ్లీతో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది. కోహ్లీ చాలా నిజాయితీపరుడు అని.. ఉక్కు సంకల్పం కలిగిన వ్యక్తి అని ప్రశంసించింది.
దుబాయ్ బీచ్ లో దీపావళి వేడుకల సందర్భంగా కోహ్లీతో దిగిన ఫొటోను అనుష్క పంచుకుంది. అనంతరం ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోకు, నీ జీవన విధానానికి ఫిల్టర్ అవసరం లేదు. నిరాశ నుంచి త్వరగా బయటపడే నీలాంటి వ్యక్తిని నేను చూడలేదు. నువ్వు ప్రతీరోజు అభివృద్ధి చెందుతూనే ఉంటావు.. నాకు తెలుసు.. ’అంటూ అనుష్క శర్మ వ్యాఖ్యానించారు.
‘‘మనం ఇలా సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకునే మనుషులం కాదు.. అయితే నువ్వు ఎంత అద్భుతమైన మనిషివో ఈ ప్రపంచానికి గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంటుంది. నీ మనస్తత్వం గురించి తెలిసిన వ్యక్తులు అదృష్టవంతులు. ప్రతీదాన్ని మరింత అందంగా చేస్తున్నందుకు నీకు ధన్యవాదాలు.. హ్యాపీ బర్త్ డే’’ అంటూ అనుష్క ఇన్ స్టాగ్రామ్ లో కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపారు.