సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య హీరోయిన్స్ కొందరు ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అని నిరూపిస్తున్నారు. తెరపై అందంతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. తెలివితేటలతో వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. కోహ్లీ భార్య, స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఆ కోవకే చెందుతారు. సినిమాలు చేస్తూనే.. కొన్ని బ్యూటీ యాడ్స్ ప్రకటనలతో బిజీగా ఉంటుంది. బ్యూటీ విత్ బ్రెయిన్ అని అనుష్కను అనడానికి.. ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థను స్థాపించి కొత్త సినిమాలు నిర్మిస్తుంది. ఆమె సొంత సంస్థలో కేవలం సినిమాలనే కాకుండా తాజాగా వెబ్ సిరీస్‌లను కూడా నిర్మిస్తుంది. కథాబలం ఉంటే సినిమాలు తీసి.. సినీ అభిమానులను మెప్పించాలని అనుష్క 2014లో ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్స్’ పేరుతో ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించింది. తన సంస్థ ద్వారా అనుష్క కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తుంది.
ప్రస్తుతం విరాట్ అనుష్కలు లాక్ డౌన్ కారణంగా గృహ నిర్బంధం లో ఉన్నారు. ఇటీవలే తన పెంపుడు కుక్క బ్రూనో చనిపోవడంతో బాధపడింది. అనుష్క ఎల్లపుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. కొత్త కొత్త పోస్టులతో అభిమానులను అలరిస్తుంది. ఇక తను నిర్మించిన మొదటి వెబ్ సిరీస్ ‘పాతాళ్ లోక్’ తాజాగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌కు అవినాష్ అరుణ్ దర్శకత్వం వహించారు. నీరజ్ కబీ, గుల్ పనాగ్, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనితో పాటు మరిన్ని వెబ్ సిరీస్‌లను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. అనుష్క మాట్లాడుతూ.. అమెజాన్ ప్రైమ్ లో 'పాతాళ లోక్' ప్రసారం అవుతుంది. అందరూ చూడండి అంటూ పోస్ట్ చేసింది. ఇంకా అనుష్క విరాట్ ల వ్యంగ్య చిత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వీరిద్దరూ కూడా అలాంటి వ్యంగ్య చిత్రాలు మాకు కూడా ఇష్టమే అనడంతో.. ఫ్యాన్స్ కూడా ఆ ఫోటో అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.