షాక్ ఇవ్వబోతున్న అనుష్క!

Update: 2018-10-31 06:43 GMT
ఎప్పుడో జనవరిలో వచ్చిన భాగమతి తర్వాత స్వీటీ అనుష్క మళ్ళి వెండితెరపై కనిపించక అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. కొత్త సినిమా తాలూకు అప్ డేట్స్ లేవు. సరే పోనీ పెళ్లి వార్తయినా తెలుస్తుందేమో అనుకుంటే అసలు మైకు ముందుకు వస్తే కదా. గత కొంత కాలంగా వెయిట్ లాస్ మీద సీరియస్ గా ఫోకస్ పెట్టి దానికి సంబందించిన శిక్షణలో బిజీగా ఉన్న అనుష్క త్వరలోనే స్వదేశానికి తిరిగి రానుంది. అందరూ ఊహిస్తున్నట్టు పెళ్లి కోసం కాదు. ఓ తమిళ సినిమాలో నటించేందుకు రెడీ అవ్వడానికి.

లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులో ఇంతకు ముందు చేయని సరికొత్త పాత్రతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్. తిరిగి వచ్చాక అన్ని వివరాలు తెలియజేయబోతున్నారు. అందులో హీరో ఎవరు లాంటి విషయాలు మాత్రం ఇప్పటికి  గుట్టే. బాహుబలి తర్వాత నిజానికి అనుష్కకు లెక్కలేనన్ని ఆఫర్స్ వచ్చాయి. భాగమతి తర్వాత కూడా అంతే. కొరటాలశివ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే 152 సినిమాకు అనుష్కనే అడిగినట్టు ప్రచారం జరిగింది.

కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి అనుష్క స్వయంగా క్లారిటీ ఇస్తే తప్ప వీటికి చెక్ పడదు. ఆ మధ్య ప్రభాస్ తో పెళ్లి అంటూ కొంత కాలం లేదు ఫ్యామిలీ సెట్ చేసిన బిజినెస్ మెన్ సంబంధం అంటూ కొంతకాలం మీడియాలో నానా రచ్చ జరిగింది. కానీ అదంతా తూచ్ అని తెలుస్తూనే ఉంది. ఫైనల్ గా అనుష్క చేయబోయే సినిమాలు తన ఫ్యూచర్ గురించి క్లారిటీ రావాలంటే వచ్చాకే అడగాలి
   

Tags:    

Similar News