అనుష్క సినిమా ల కోసం ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదుగో ఇదుగో అంటూ సినిమా ను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ అనుష్క తన కొత్త సినిమా ను ఆలస్యం చేస్తుంది.
ఆమె నుండి సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కాని అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అయినా అభిమానులతో టచ్ లో ఉండాలని కోరుకుంటున్న అభిమానులు ఉన్నారు.
ఇతర హీరోయిన్స్ మాదిరిగా అనుష్క తన స్కిన్ షో చేస్తూ ఫోటో షూట్స్ ను చేయడం లేదు. కనీసం రెగ్యులర్ ఫోటోలను కూడా షేర్ చేయడం లేదు. ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాల్లో కూడా పెద్దగా స్కిన్ షో చేసిందే లేదు. ఈ అమ్మడు ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తు ఉంటుంది.
నేడు అనుష్క ఇన్ స్టా గ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. యోగా డే సందర్బంగా అనుష్క అందుకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. సినిమాల్లో రాకముందే యోగా గురువుగా.. ట్రైనర్ గా విధులు నిర్వహించిన అనుష్క హీరోయిన్ అయిన తర్వాత కూడా యోగా ను వీడకుండా చేస్తూ ఉండేది. ఆమె అందంకు యోగానే కారణం అనడంలో సందేహం లేదు.
యోగా డే సందర్బంగా తన యోగా గురువు అయిన భరత్ ఠాకూర్ ను గుర్తు చేసుకోవడం తో పాటు జనాలకు కాస్త మోటివేషన్ గా వ్యాఖ్యలు చెప్పుకొచ్చింది. అనుకున్నది సాధించడం కోసం ఎంతో నేర్చుకోవాలి.. ఎన్నో అర్థం చేసుకోవాలి అంటూ తనదైన శైలిలో కాస్త హిత బోద అన్నట్లుగా పోస్ట్ పెట్టింది.
అనుష్క యోగా డే పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సందర్బంగా అయినా అనుష్క తన సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తే బాగుండేది కదా అంటూ కొందరు ఆ పోస్ట్ కు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె కు రిటర్న్ గా హ్యాపీ యోగా డే ను తెలియజేస్తున్నారు.