టాలీవుడ్ లో అనుష్క ప్రధాన పాత్రలో అశోక్ దర్శకత్వంలో వచ్చిన 'భాగమతి' కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. యావరేజ్ టాక్ వచ్చినా కూడా అనుష్క క్రేజ్ కారణంగా.. ఆమె నటన మరియు ఆమె గంభీర్యం కారణంగా సినిమా స్థాయి అమాంతం పెరిగింది. సినిమా ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండు అనే కామెంట్స్ అయితే వచ్చాయి కాని సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. భాగమతిని హిందీలో రీమేక్ చేస్తే తప్పకుండా అక్కడ ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకంతో దుర్గమతిగా రీమేక్ చేశారు. తెలుగు వర్షన్ కు దర్శకత్వం వహించిన అశోక్ హిందీలో కూడా రూపొందించాడు.
తెలుగు దర్శకుడే హిందీలో కూడా తీసినా కూడా ఫలితం తేడా కొట్టింది. ఆయన తనవంతు ప్రయత్నం చేసినా కూడా నటీనటుల వల్ల సినిమా ఫలితం తారు మారు అయ్యిందంటూ విమర్శలు వస్తున్నాయి. ఇటీవల అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన దుర్గమతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. కమెడియన్స్ నుండి మొదలుకుని హీరోయిన్ వరకు ఎవరు కూడా సరిగా చేయలేక పోయారు. భాగమతి పాత్రల్లో నటీనటులు జీవించినట్లుగా అనిపించింది. కాని దుర్గమతిలో మాత్రం కనీసం నటించినట్లుగా కూడా అనిపించలేదు. అందుకే సినిమా నిరాశ పర్చింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీమేక్ లో కూడా అనుష్క నటించి ఉంటే తప్పకుండా ఫలితం వేరేలా ఉండేది అనేది చాలా మంది వాదన. బాహుబలి సినిమాతో అనుష్క బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి ఆధరణ దక్కించుకుంది. అలాంటి అనుష్క దుర్గమతిగా నటించి ఉంటే ఖచ్చితంగా భాగమతి ఫలితం రిపీట్ అయ్యి ఉండేది అనేది సినీ విశ్లేషకుల వాదన.