యూనివ‌ర్శ‌ల్ లెవ‌ల్లో మూగ భాష నేర్చుకున్న అనుష్క‌

Update: 2020-09-26 17:00 GMT
మూగ చెవిటి బ‌ధిర విద్యార్థుల‌కు పాఠాలు నేర్పించే టీచ‌ర్ ని ఎప్పుడైనా ప‌రిశీలించారా? చేతి వేళ్ల‌తో ముఖ క‌వ‌ళిక‌ల‌తో ర‌క‌రకాల సంజ్ఞ‌లు ఇస్తూ పాఠాలు చెబుతుంటారు. మాట వినిపించ‌ని వారికి ఆ క‌ష్టం అంతా ఇంతా కాదు క‌దా! అందుకే వాటిని బ‌ధిర విద్యార్థులు నేర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే ఈ త‌ర‌హా టీచింగ్ విద్య నేర్చుకోవ‌డం అంటే ఆషామాషీ కాదు. దానికి ఎంతో గొప్ప మ‌న‌సు సేవా ధృక్ప‌థం కావాలి.

ప్ర‌స్తుతం ఇలాంటి విద్య‌లో స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి రాటు దేలిపోయింద‌ట‌. ఇదేమీ లోక‌ల్ రేంజ్ కాదు.. నేష‌న‌ల్ రేంజ్ కూడా కాదు. ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ ట్రైనింగ్ అని చెప్పి పెద్ద షాకిచ్చింది అనుష్క టీమ్. నిశ్శ‌బ్ధం కోసం ఇంట‌ర్నేష‌న‌ల్ సైన్ లాంగ్వేజ్ (సంజ్ఞ‌ల మూగ సైగ‌ల‌) ను అనుష్క నేర్చుకున్నార‌ని.. ఈ సినిమాలో డంబ్ అండ్ డెఫ్ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలిపారు.

అయితే సైన్ లాంగ్వేజ్ ఇండియాలో ఒక‌లా.. ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ లో మ‌రోలా ఉంటాయ‌ట‌. అందుకే ఈ సినిమా కోసం యూనివ‌ర్సల్ గా ఉన్న సైన్ లాంగ్వేజ్ లో ట్రైనింగ్ తీసుకుని మ‌రి యాక్ట్ చేసింద‌ట అనుష్క‌. ఈ సినిమా త‌న‌కు గొప్ప పేరు తేవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అలాగే అవార్డ్ వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదేమో! నిశ్శ‌బ్ధం ఓటీటీలో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిన‌దే. ఇక ఈ మూవీ త‌రువాత స్వీటీకి మ‌రో సినిమాకి సంత‌కం చేయ‌లేదు. గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ డైర‌క్ష‌న్ లో ఏదో సినిమా ఉంద‌ని ఎప్ప‌టినుంచో చెబుతున్నారు కానీ ఇంత‌వ‌రుకు ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క లేదు.
Tags:    

Similar News