ప్రైవేట్ పార్ట్స్ పై నెటిజన్ కామెంట్.. దుమ్ముదులిపిన హీరోయిన్

Update: 2020-06-12 07:10 GMT
చాలా మంది సినీ సెలెబ్రెటీలు సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ ను భరిస్తుంటారు. ఎంత అవమానిస్తున్నా కొందరు పట్టించుకోరు.. మరికొందరు కౌంటర్ఇస్తారు. కానీ తాజాగా ఓ హీరోయిన్ మాత్రం సోషల్ మీడియాలో నెటిజన్ కు భారీ షాక్ ఇచ్చింది..

మలయాళీ నటి అపర్ణా నాయర్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్లు చేసిన ఓ నెటిజన్ కు సదురు హీరోయిన్ గట్టి బుద్ది చెప్పింది. అతడి డిటైల్స్ అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసి కడిగిపారేసింది. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

హీరోయిన్ అపర్ణా నాయర్ ను ఉద్దేశించి నెటిజన్ ఐలవ్ యూ అంటూ ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై కూడా కామెంట్ చేశాడు. దీంతో హీరోయిన్ అపర్ణాకు చిర్రెత్తుకొచ్చింది. దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది.

తన ప్రైవేట్ పార్ట్స్ పై కామెంట్ చేసిన సదురు నెటిజన్ పేజీని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన అపర్ణా ఆ వ్యక్తికి దిమ్మ దిరిగిపోయే కౌంటర్ ఇచ్చింది. ఫొటోతో సహా సదురు వ్యక్తి ఫేజీ బుక్ ప్రొపైల్ ను షేర్ చేసింది అపర్ణా. అనంతరం ఘాటుగా రిప్లై ఇచ్చింది.

‘ఇది నా స్నేహితులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఉన్న పేజ్ అని.. కొంతమంది తమ శృంగార ఆశలు వెలిబుచ్చే స్థలం కాదని.. మీ శృంగార కోరికలు నేను తీరుస్తా అని భావిస్తే ఆ ఆలోచనలు మానుకోవాలని సూచించింది. అలాంటి చీప్ పనులు నేను చేయనని హితవు పలికింది.

అంతేకాదు.. సదురు నెటిజన్ పేరు ప్రస్తావిస్తూ .. నీకు ఒక కూతురు ఉంది. ఆమెను హత్తుకున్న ఫొటోలు పెట్టావ్.. అలాగే నేను కూడా ఓ తండ్రికి కూతురినే అని గడ్డిపెట్టింది. తాను ఈ సోషల్ మీడియాలో తన పనిని ప్రమోట్ చేస్తానని.. నీకు 30 సెకన్ల సుఖాన్ని ఇవ్వను ’ అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది హీరోయిన్ అపర్ణ

అపర్హ స్పందన చూసి బాగా గడ్డి పెట్టావ్ అని.. ఇలాంటి నెటిజన్ల విషయంలో హీరోయిన్ స్పందన భేష్ అంటూ ఆమెను పలువురు కొనియాడుతున్నారు. 
Tags:    

Similar News