#MAAelections:మా ఎన్నికలు.. బ్రహ్మణుల ఎంట్రీ

Update: 2021-10-10 05:30 GMT
మా ఎన్నికలు ఈసారి ప్రతిష్టాత్మకం అయ్యాయి. రెండు ప్యానల్స్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరా హోరీగా పోటీ పడుతున్నాయి. మంచు విష్ణు ప్యానల్ మరియు ప్రకాష్ రాజ్ ప్యానల్స్ గెలుపు కోసం సాధ్యం అయినంతగా ప్రయత్నాలు చేశాయి. రాజకీయ ఎన్నికలను తలపించిన మా ఎన్నికల రోజు రానే వచ్చేసింది. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే విషయం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపే వారు.. మంచు విష్ణుకు మద్దతు తెలిపే వారు.. ఇలా చాలా మంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. తాజాగా బ్రహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ మాట్టాడాడు. మంచు ఫ్యామిలీకి బ్రహ్మణులకు ఆమద్య గొడవ జరిగింది. దేనికైనా రెడీ సినిమా సమయంలో జరిగిన గొడవ నేపథ్యంలో మంచు ఫ్యామిలీ పై ఇప్పటికి కూడా బ్రహ్మణులు ఆగ్రహంతోనే ఉన్నారు.

తాజాగా అదే విషయమై శిరిపురం శ్రీధర్ శర్మ మాట్లాడుతూ బ్రహ్మణులు అంటే గౌరవం లేని మంచు ఫ్యామిలీకి చెందిన వారికి మా ఎన్నికల్లో ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేశాడు. మా ఎన్నికల్లో మంచు విష్ణును ఓడించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశాడు. బ్రహ్మణులపై దాడులు చేయించి.. బూతులు మాట్లాడిన వారిని జనాలు నమ్మవద్దంటూ ఆయన విజ్ఞప్తి చేయడంతో పాటు ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ఓడిపోవాలని బలంగా కోరుకుంటున్నట్లుగా కూడా పేర్కొన్నాడు. ఎన్నికలు కొన్ని గంటలకు జరుగనున్న సమయంలో ఈయన రంగంలోకి దిగి మంచు ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడటం చాలా మందికి ఆశ్చర్యంను కలిగించింది. ఇన్ని రోజుల నుండి ఈ వివాదం సమసి పోయినట్లుగానే అనిపించింది. కాని ఎన్నికల ముందు ఈ వివాదం ను మళ్లీ రేపేలా ప్రయత్నాలు చేయడం అంటే కొందరు కావాలని వారిని రెచ్చగొట్టారేమో అంటున్నారు.

కొందరు కావాలని ఇప్పుడు మంచు ఫ్యామిలీపైకి బ్రహ్మణులను రెచ్చ గొట్టి పంపిస్తున్నట్లుగా మంచు విష్ణు ప్యానల్‌ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు కొన్ని గంటల ముందు శిరిపురం శ్రీధర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఎంత వరకు మా ఎన్నికలపై ప్రభావం చూపిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. మా ఎన్నికల్లో గెలుపు ఓటములు అయిదు పది ఓట్ల తేడాతోనే ఉండే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్క ఓటు కూడా చాలా కీలకం. అందుకే శిరిపురం శ్రీధర్ శర్మ వ్యాఖ్యలు కొంతలో కొంత అయినా డ్యామేజీని మంచు విష్ణుకు చేస్తాయేమో అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యల వల్ల రెండు మూడు ఓట్లు తగ్గినా కూడా అది ఖచ్చితంగా డ్యామేజీ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు కూడా చాలా స్ట్రాంగ్ గా ప్రచారం అయితే చేశారు. మా సభ్యుల తీర్పు ఏంటీ అనేది చూడాలి. .
Tags:    

Similar News