మహేష్‌ తో నయనతరా? అంత సీన్ లేదు

Update: 2016-09-16 05:50 GMT
ఇప్పటికే ఏ.ఆర్.మురుగుదాస్ సినిమాలో మహేష్‌ బాబుతో తొలిసారి రొమాన్స్ చేయనుందంటూ రకుల్ ప్రీత్ సింగ్ మారుమ్రోగిపోతోంది. అయితే సినిమాను తెలుగు అండ్ తమిళంలో బైలింగువల్ గా రూపొందిస్తున్నారు కాబట్టి.. ఆల్రెడీ కమెడియన్లను ఇతర ఆర్టిస్టులను అక్కడికీ ఇక్కడికీ వేర్వేరుగా తీసుకుంటున్నారు కాబట్టి.. తమిళం కోసం మరో హీరోయిన్ ను కూడా తీసుకుంటున్నారు అని చెప్పారు.

అవును.. మహేష్‌ తో తొలిసారిగా నయనతార రొమాన్స్ చేయనుందని వార్తలొచ్చేశాయి. అసలు ఎప్పుడు చూసినా కూడా ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్లపై రూమర్లు రావడం కొత్తేం కాదుగా. ఆలియా భట్ - పరిణీతి చోప్రా.. ఇలా చాలామంది పేర్లు ఈ సినిమా రిలేటెడ్ గా వినిపించాయిలే గతంలో. అయితే ఈ విషయంపై స్పందించిన మురుగుదాస్.. అసలు సినిమాలో రకుల్ ప్రీత్ తప్పించి మరో హీరోయిన్ చేయడానికి కూడా ఛాన్సే లేదని చెప్పారు. నయనతారను పెట్టుకునేంత సీన్ లేదని తేల్చేశాడు.

గతంలో బ్రహ్మోత్సవం సినిమాలో పనిచేయాల్సిన సెక్సీ లేడీ రకుల్ ఇప్పుడు మహేష్‌ తో ఛాన్సు అనగానే కథ వినకుండానే ఓకె చేసేశానని గతంలోనే చెప్పింది. సో.. ఆమె ఒక్కతే సోలోగా రొమాన్స్ చేస్తుంది మరి. ప్రస్తుతం చెన్నయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న మహేష్‌-మురుగుదాస్ సినిమా.. జనవరి వరకు ఏకధాటిగా షూట్ చేసి సినిమాను పూర్తి చేయనున్నారు.
Tags:    

Similar News