96 సినిమా 2018 సెన్సేషనల్ హిట్ గా డిక్లేర్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో త్రిష, విజయ్ సేతుపతిల నటనకు పేరొచ్చింది. ఆ సినిమా ఇప్పటికే పలు క్రేజీ అవార్డులు గెలుచుకుంది. త్రిషను అవార్డులు రివార్డులు వరించాయి. ఆ ఒక్క బ్లాక్ బస్టర్ తర్వాత త్రిష కెరీర్ గ్రాఫ్ అమాంతం స్కైని టచ్ చేసింది. ఇప్పటికిప్పుడు అరడజను సినిమాలకు సంతకాలు చేసింది. 2019-2020 కాల్షీట్లు ఇప్పటికే బ్లాక్ అయిపోయాయి.
ప్రస్తుతం నాలుగు సినిమాలు ఆన్ సెట్స్ ఉన్నాయి. గర్జనై - పరమపధమ్ విళయాట్టు - శతురంగ వేట్టై 2 వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సిమ్రన్ లాంటి సీనియర్ కథానాయికతో కలిసి త్రిష ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. సుమంత్ రాధాకృష్ణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాలతో పాటు కన్నడలోనూ పలువురు దర్శకనిర్మాతలతో సంప్రదింపులు సాగిస్తోందిట.
ఈలోగానే మరో క్రేజీ ఆఫర్ త్రిషను వరించింది. జాతీయ అవార్డ్ గ్రహీత.. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో కలిసి ఓ ప్రాజెక్టును చేసేందుకు అంగీకరించిందిట. ఈ చిత్రానికి మురుగదాస్ శిష్యుడు.. జర్నీ ఫేం శరవణన్ దర్శకత్వం వహించనున్నాడు. మురుగదాస్ స్క్రిప్టును అందిస్తున్నారు. అతడు ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా `దర్భార్` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ముంబైలో సినిమా మొదలైంది. ఇక మురుగదాస్ దర్శకత్వం వహించే సినిమాలన్నిటికీ తనే స్క్రిప్టు రూపకర్త. గజిని - తుపాకి - కత్తి - సర్కార్ లాంటి చిత్రాలకు మురుగదాస్ రచనా విభాగంలో కర్త కర్మ క్రియ. స్క్రిప్టు పరంగా అతడే ప్రతిదీ. ఇపుడు త్రిష సినిమాకి స్క్రిప్టు అందిస్తుండడంతో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే భావిస్తున్నారంతా.