మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. దీని కోసం అదిరిపోయే కాంబినేషన్ సెట్ చేసింది చిత్ర బృందం. కానీ వాళ్లు అనుకున్న కాంబినేషన్ వర్కవుట్ కావట్లేదు. ముందుగా ఈ సినిమా నుంచి లెజెండరీ కెమెరామన్ తప్పుకున్నాడు. ఆ తర్వాత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ సంగతి నిజమే అని ఇప్పుడు రూఢి అయిపోయింది. స్వయంగా రెహమానే తాను ఈ సినిమా చేయలేకపోతున్నానని స్పష్టం చేశాడు. మ్యూజికల్ కన్సర్ట్ కోసం హైదరాబాద్ వచ్చిన రెహమాన్.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.
‘‘సైరా స్క్రిప్టు విన్నాను. చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. పైగా చిరంజీవి నా అభిమాన కథానాయకుడు. కానీ సమయం అనుకూలించడం లేదు. అందుకే ఆ ప్రాజెక్టు చేయలేకపోతున్నాను. అంత మంచి సినిమాకు చేయలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాను. ఎప్పట్నుంచో చిరంజీవి సినిమాకు చేయాలని ఉన్నా కుదరట్లేదు’’ అని రెహమాన్ తెలిపాడు. తెలుగు సినీ పరిశ్రమతో తనకు గొప్ప అనుబంధం ఉందని.. తాను సంగీత దర్శకుడిగా మారడానికి ముందు ఈ ఇండస్ట్రీ తననెంతో ప్రోత్సహించిందని రెహమాన్ చెప్పాడు. రమేష్ నాయుడు దగ్గర్నుంచి రాజ్-కోటి వరకు ఎందరో ఉద్ధండుల దగ్గర తాను సంగీతంలో మెలకువలు నేర్చుకున్నానని.. రాజ్-కోటిలను తన పెద్దన్నల్లాగా భావిస్తానని రెహమాన్ అన్నాడు. తెలుగు సంగీత దర్శకుల్లో తాను విశ్వనాథ్ ను ఆరాధిస్తానని చెప్పాడు.