ఏడేళ్ల కిందట ఒకేసారి రెండు ఆస్కార్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు ఏఆర్ రెహమాన్. ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు కూడా అతను గట్టి పోటీదారు అవుతాడనుకున్నారు. పీలే సినిమాకు గాను అతను ఒరిజినల్ స్కోర్.. ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో పోటీ పడ్డాడు. ఐతే ఈ రెండు విభాగాల్లోనూ అతడికి నామినేషన్ దక్కలేదు. మంగళవారం ప్రకటించిన నామినేషన్ల జాబితాలో రెహమాన్ కు చోటు దక్కలేదు.
లెజెండరీ కంపోజర్ థామస్ న్యూమన్.. లా లా ల్యాండ్ సినిమాకు సంగీతాన్నందించిన జస్టిన్ హర్విట్జ్ లతో పాటు మరికొందరు ఈ విభాగాల్లో నామినేషన్లు పొందారు. ఒకటికి రెండు విభాగాల్లో రెహమాన్ పోటీ పడటంతో అందులో ఒక్క అవార్డయినా రెహమాన్ కు దక్కకపోదని అభిమానులు ఆశించారు. కానీ పోటీ తీవ్రంగా ఉండటంతో రెహమాన్ నామినేషన్ సాధించలేకపోయాడు. 2009లో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాకు రెహమాన్ ఒకేసారి రెండు ఆస్కార్లు అందుకున్నాడు.
ఈసారి ఇండియా నుంచి ఉత్తమ విదేశీ చిత్రం అవార్డుకు నామినేట్ అయిన తమిళ సినిమా ‘విసారణై’ ప్రాథమిక దశలోనే పోటీ నుంచి తప్పుకుంది. ఈసారి ‘లా లా ల్యాండ్’ సినిమా ఏకంగా 14 ఆస్కార్ నామినేషన్లు సంపాదించడం విశేషం. ఫిబ్రవరి 26న లాస్ ఏంజిల్స్ లోని హాలీవుడ్ థియేటర్లో 89వ ఆస్కార్ అవార్డుల వేడుక జరుగుతుంది.