ఏఆర్ రహమాన్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది ఆయన పాటలు. ఎన్నో అద్బుతమైన మ్యూజిక్ ఆల్బం లను ఇచ్చిన సంగీత సామ్రాట్ ఏఆర్ రహమాన్ తన సంగీతంతో ఆస్కార్ ను కూడా దక్కించుకున్న విషయం తెల్సిందే. సంగీత సామ్రాజ్యంలో సుదీర్ఘ కాలంగా రారాజుగా కొనసాగుతూ వస్తున్న రహమాన్ ఎట్టకేలకు తన పంథా మార్చుకున్నాడు. రహమాన్ సంగీత దర్శకుడిగా కొనసాగుతూనే నిర్మాతగా మరియు స్క్రిప్ట్ రైటర్ గా మారాడు. ఆయన నిర్మాణంలో రాబోతున్న మొదటి సినిమా '99 సాంగ్స్'. ఈ సినిమాకు కథను రహమాన్ అందించడం విశేషం. ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. 2019లో ఈ సినిమా పట్టాలెక్కింది. ఎట్టకేలకు ఈ సినిమాను ఈనెల 16వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
99 సాంగ్స్ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్మాత కమ్ స్క్రిప్ట్ రైటర్ అయిన ఏఆర్ రహమాన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. తాను సంగీతమే ప్రపంచం అనుకుంటున్న సమయంలో ఒకానొక సమయంలో దర్శకుడు మణిరత్నం గారు మాట్లాడుతూ నువ్వు ఒక పాటను ట్యూన్ ఎలా చేస్తావో సినిమాను కూడా అలాగే నిర్మించవచ్చు. నీ పాటలకు సంగీతాన్ని ఎలా కంపోజ్ చేస్తావో అలాగే స్క్రిప్ట్ కూడా రెడీ చేయవచ్చు. ఆయన మాటలను ఆదర్శంగా తీసుకుని నేను ఈ సినిమాను తీశానంటూ తన కొత్త జర్నీ క్రెడిట్ మొత్తాన్ని కూడా దర్శకుడు మణిరత్నంకు ఇచ్చేశాడు.
భవిష్యత్తులో దర్శకత్వంలో కూడా అడుగు పెట్టే విషయమై రహమాన్ ఆలోచిస్తున్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది. సంగీత దర్శకులు పలువురు సినిమాలకు దర్శకత్వం వహించారు. కనుక ఏఆర్ రహమాన్ సినిమాకు దర్వకత్వం వహిస్తాడు అంటే కొత్తేం కాదు. ఆయన తన సంగీతంతోనే కాకుండా తన సినిమాలతో కూడా అభిమానులను ఉర్రూతలూగించాలని కోరుకుంటున్నారు. రొమాంటిక్ డ్రామా '99 సాంగ్స్' సినిమా సక్సెస్ అయితే రహమాన్ నుండి మరిన్ని సినిమాలు వస్తాయని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. హిందీతో పాటు పలు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట.