‘బాహుబలి’ రెండు భాగాలుగా తెరకెక్కినప్పటికీ.. దాన్ని ఒక సినిమాగానే పరిగణించాలి. ఈ సినిమా బడ్జెట్ రూ.250 కోట్లు. ప్రస్తుతానికి అదే ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో తయారైన సినిమా. ఈ రికార్డును బద్దలు కొట్టడానికి శంకర్ సిద్ధమవుతున్నాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో-2 బడ్జెట్ రూ.350 కోట్లు. బాలీవుడ్డోళ్లే ఇంతవరకు రూ.200 కోట్లు పెట్టి సినిమా తీయలేదు. అలాంటిది సౌత్ సినిమాలో ఈ స్థాయిలో బడ్జెట్లతో సినిమాలు రూపొందించడం ఆశ్చర్యకరమైన విషయం.
సౌత్ సినిమా సంచలనాలు ఇంతటితో ఆగట్లేదు. రోబో-2 కంటే ఎక్కువ బడ్జెట్ తో సినిమా తీయడానికి మరో తమిళ దర్శకుడు సుందర్.సి రెడీ అవుతున్నాడు. బడ్జెట్ ఇంత అని చెప్పలేదు కానీ.. తన దర్శకత్వంలో తెండ్రాల్ ఫిలిమ్స్ తీయబోయేదే ఇండియాస్ బిగ్జెస్ట్ మూవీ అని స్పష్టం చేశాడతను. ఇందులో హీరో విజయ్ అని.. సూర్య అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
హీరో సంగతి తేలకున్నా.. టెక్నీషియన్స్ సంగతి మాత్రం ఖరారైపోయింది. ఈ చిత్రానికి సాబు శిరిల్ ఆర్ట్ డైరక్షన్.. కన్నన్ వీఎఫ్ ఎక్స్ అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడెవరో కూడా తేలిపోయింది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఈ చిత్రానికి పని చేస్తున్నాడు. ఇది ‘బాహుబలి’ తరహాలో జానపద చిత్రం అని చెబుతున్నారు. రెహమాన్ భారీ భారీ సినిమాలకు సంగీతం అందించాడు కానీ.. జానపద చిత్రాలకు పని చేసింది లేదు. మరి సుందర్ సినిమాకు ఎలాంటి ఔట్ పుట్ ఇస్తాడో చూడాలి. సుందర్ ఆల్రెడీ ఈ ప్రాజెక్టు మీద ఏడాదిగా పని చేస్తున్నాడట. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది.