అమ్మ భాష మీద అభిమానం అందరికి ఉంటుంది ఒక్క తెలుగు వారికి తప్ప. ప్రపంచంలో ఏ ఇద్దరు తెలుగువారు కలిసినా.. అమ్మ భాషలో కంటే.. ఆంగ్ల భాషలో మాట్లాడేందుకే ఇష్టపడటం కనిపిస్తుంది. అంతేకాదు.. తమ అమ్మభాషను అంతర్జాతీయ వేదికల మీద ప్రస్తావించేందుకు.. పరిచయం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. అంతేకంటే.. ఇంగ్లిషు మీద తమకున్న అభిమానం ఎంతన్న విషయాన్ని చాటేందుకు ప్రయత్నిస్తుంటారు. తెలుగోళ్లకు తెగులు.. అమ్మ భాష మీద అభిమానం లేని దగ్గర నుంచే పుడుతుందన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది.
అమ్మభాష మీద మిగిలిన వారికి ఉండే అభిమానం ఎంతన్న విషయాన్ని చెప్పే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాలకు పక్కనే ఉండే తమిళనాడు ఇందుకు వేదికైంది. సంగీత దిగ్గజం.. ఏఆర్ రెహమాన్ సొంతంగా కథను రాసి.. నిర్మించిన ‘‘99 సాంగ్స్’’ చిత్ర ప్రీ రీలీజ్ వేడుక తాజాగా జరిగింది. తమిళం.. తెలుగు.. హిందీలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ మాట్లాడుతూ చిత్ర హీరో ఇహాన్ భట్ ను పరిచయం చేసేక్రమంలో చెన్నైలో మీకు హార్దిక స్వాగతమంటూ హిందీలో మాట్లాడారు. అంతనే స్పందించిన రెహమాన్ ‘హిందీనా?’ అంటూ ఆశ్చర్యంగా చూశారు. నవ్వుతూ స్టేజ్ దిగారు. దీంతో కంగారు పడిన యాంకర్.. సార్.. సార్ అనటంతో రెహమాన్ బదులిస్తూ తమిళనంలోనే మాట్లాడాలని నేనింకా మీకు చెప్పలేదా? అంటూ ప్రశ్నించటంతో సరదాగా నవ్వేసింది.
తమిళంలోనే మాట్లాడతానని చెప్పటంతో రెహమాన్ స్టేజ్ మీదకు తిరిగి వచ్చారు. తాను అదంతా సరదాగా చేసినట్లు చెప్పినా.. తమిళులకు తమ అమ్మ భాష మీద ఉండే మక్కువ ఎంతన్న విషయాన్ని తాజా ఉదంతం చెబుతుందని చెప్పాలి. ఇదే పనిని.. తెలుగు చిత్రపరిశ్రమలోనే కాదు.. ఏ రంగంలోని ప్రముఖుడైనా సరదాకైనా చేయగలడా? అన్నది ప్రశ్న. అలాంటి వారు ఒక్కరు కూడా కనిపించకపోవటం తెలుగు చేసుకున్న దురదృష్టం. కాదంటారా?