ఇంటర్వ్యూ: మెరుపు కలల విలన్

Update: 2015-07-31 16:19 GMT
రోజా, బొంబాయి, మెరుపు కలలు .. ఈ సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు అరవింద్‌ స్వామి. అతడు ఎప్పుడూ నటుడు అవ్వాలనుకోలేదు. కానీ విధి ప్రకారం నటుడయ్యాడంతే. ప్రతి సినిమా దానంతట అదే అతడిని వెతుక్కుంటూ వచ్చినవే. అసలు మణిరత్నంతో పరిచయం సహా ఇతర విషయాల గురించి అరవింద్‌ స్వామి ఏం చెప్పాడంటే...

మణిరత్నం సినిమాలో నటిస్తున్నారట కదా?

నాకింకా తెలియదు. కానీ అతడి చాయిస్‌ అన్నివేళలా నేనే అవుతానేమో (నవ్వుతూ). అసలు నటన అంటే ఏమిటో తెలీని వాడిని పిలిచి హీరోని చేశారాయన. అతడు అవకాశం ఇస్తే .. నేనే తన హీరో అవ్వాలనుకుంటాను. అంత అభిమానం మణిరత్నంపై ఉంది. నేనెప్పుడైనా ఓ సినిమాలో నటిస్తే, బాగా చేశానా? లేదా? అన్నది కూడా తనని అడుగుతా. 'పోడా' అనేస్తారాయన. అంత చనువు మా మధ్య ఉంది. థాని ఒరువన్‌ అనే సినిమా ట్రైలర్‌ ని మణిరత్నం వద్దకి పంపించి అడిగాను. ఎలా ఉన్నాన్నేను? అని ప్రశ్నించా. అట్నుంచి రిప్లయ్‌ లేదు.

థాని ఒరువన్‌ లో విలన్‌ గా నటించారట...

అవును. అయితే అది నెగెటివ్‌ షేడ్‌ ఉన్న పాత్ర మాత్రమే. పూర్తి విలన్‌ అని చెప్పలేం. గ్రేషేడ్స్‌ ఉండవు.

నెగెటివ్‌ పాత్రలు ఇష్టమా?

నేను నటనలో ఎప్పుడూ శిక్షణ తీసుకోలేదు. డైరెక్ట్‌ గా సెట్‌ లోకొచ్చి నటించేశానంతే. అక్కడికొచ్చాకే నేర్చుకునేది. నా ప్రతి సినిమాలో ఇలాగే చేశాను. ఈ చిత్రంలో నా పాత్ర చాలా కీలకమైనది. దర్శకుడు ఎం.రాజా రాసుకున్న కథలో ఎంతో కీపాయింట్‌. బ్యాడ్‌ గా ఎక్కడా పైకి కనిపించను. కానీ బ్యాడ్‌ క్యారెక్టర్‌ అది. అదే ఈ సినిమాలో ప్రత్యేకత.

నటనలోనే కొనసాగుతారా?

నటన సీరియస్‌ జాబ్‌ కాదు. ఇందులోనే కొనసాగుతానా? అంటే చెప్పలేను. అయితే 20 వయసప్పటి నుంచి నేను ఈ రంగంలోనే కొనసాగుతున్నా.

విలన్‌ పాత్రల్లో నటిస్తారా?

కడల్‌ సినిమాలో ఓ ప్రీస్ట్‌ గా నటించాను. ఓ చెడ్డవాడికి దైవజ్ఞుడికి మధ్య పోరాటం అందులో చూపించారు. ఇప్పుడు తాజా సినిమాలో పాత్ర నెగెటివ్‌ షేడ్‌ తో ఉంటుంది.

మీ ఫ్యామిలీ గురించి?

పదేళ్లుగా నేను సింగిల్‌ పేరెంట్‌. ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటూ కాలం గడిపేస్తున్నా. కొన్నాళ్ల తర్వాత అపర్ణ ముఖర్జీని పెళ్లాడాను. అప్పటికే పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు కాబట్టి బాగానే కలిసిపోతున్నారు. విధి వైచిత్రి ఇదంతా.

Tags:    

Similar News