కోలీవుడ్ మూవీ తని ఒరువన్ ని రీమేక్ చేస్తున్న రామ్ చరణ్.. ఒరిజినల్ లో చేసిన విలన్ ని కూడా పట్టుకొచ్చేశాడు. ఒకప్పటి డ్రీమ్ హీరో అయిన అరవింద్ స్వామితో ఢీ అంటే ఢీ అంటున్నాడు చెర్రీ. చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా పవర్ఫుల్ కేరక్టర్ తో తన ట్యాలెంట్ ని చూపించాడు అరవింద్ స్వామి.
అరవింద్ స్వామి ట్యాలెంట్ విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు కానీ... ఇంత గ్యాప్ తీసుకోవడమే చాలామందికి ఆశ్చర్యం వేసింది. సింగిల్ పేరెంట్ గా ఈ పదేళ్లు తన పిల్లలలను పెంచి పెద్ద చేయడంలో బిజీగా ఉన్నాడు ఈ బొంబాయి హీరో. ప్రస్తుతం 19 ఏళ్ల కొడుకు - తన పనులు తను చేసుకోగలిగే కూతురు ఉండడంతో.. మళ్లీ నటనపై దృష్టి పెట్టగలిగానన్నది ఈ సీనియర్ హీరో మాట. నిజానికి చాలా మంది హీరోలది ఇదే పరిస్థితి. కన్న పిల్లల బాల్యాన్ని దాదాపు అందరూ మిస్ అయ్యారు. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే మినహాయింపుగా చెప్పచ్చు.
ప్రతీ వారాంతంలో మొత్తం తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసేవాడు చిరు. చెర్రీ - బన్నీ - తేజు - వరుణ్ తేజ్... ఇలా ఫ్యామిలీలో ఏ పిల్లలను కూడా వదిలిపెట్టకుండా ప్రతీ ఒక్కరినీ పిలిపించడం, అందరితో కలిసి వీకెండ్స్ ఎంజాయ్ చేయడం చిరుకు హాబీ. ఆఖరికిన తన సినిమా షూటింగ్స్ కు కూడా పిల్లలను తీసుకెళ్లే అలవాటు చిరుకు ఉండేది. ఇంతలా ఫ్యామిలీని. సినిమాలను హ్యాండిల్ చేసిన హీరో మరొకరు కనిపించరంటే ఆశ్చర్యం లేదు.