విడాకుల రూమర్లపై మండిపడ్డాడు

Update: 2016-02-03 13:30 GMT
బాలీవుడ్లో ఈ మధ్య విడాకుల వార్తలు ఎక్కువైపోయాయి. బాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ కపుల్ గా పేరొందిన ఫర్హాన్ అక్తర్-అధునా లాంటి జంట కూడా విడిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ కోవలోనే సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్.. తన మలైకా అరోరా నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు కొన్ని రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో విడాకులు, బ్రేకప్పులు చాలా కామన్ అయిపోయాయి కాబట్టి.. ఈ వార్త ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఐతే తాను మలైకా నుంచి విడాకులు తీసుకుంటున్నాననడం శుద్ధ అబద్ధం అంటున్నాడు అర్బాజ్. నేరుగా ఈ వార్తల్ని ఖండించకుండా ఈ వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై వెరైటీగా సెటైర్లు వేశాడు అర్బాజ్.  దీనికి సంబంధించి ఆర్భాజ్ ఇన్ స్టా గ్రాం లో డబ్ స్మాష్ వీడియో ఒకటి పోస్ట్ చేశాడు.

‘‘కుఛ్ తో లోగ్ కహేంగే...లోగోం కా కామ్ హై కహనా..’’ అనే పాపులర్ హిందీ పాటను దబ్ స్మాష్ చేసి మరీ అతను తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. కొంతమంది వాళ్ల పని వాళ్లు  చూసుకోకుండా.. పని గట్టుకొని ఇలాంటి పుకార్లను ప్రచారం చేస్తారంటూ అర్బాజ్ మండిపడ్డాడు. ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిదంటూ చురకలంటించాడు. 1998లో వివాహం చేసుకున్న అర్బాజ్, మలైకా బాలీవుడ్లో అన్యోన్యమైన జంటల్లో ఒకటిగా పేరు పొందారు. ఐతే మలైకా కొన్నాళ్లుగా తన 14 ఏళ్ల కొడుకుతో వేరే అపార్ట్‌మెంట్లో విడిగా ఉంటోందని.. అర్బాజ్ నుంచి ఆమె విడాకులు తీసుకోబోతోందని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. కొన్నాళ్లు వీళ్లిద్దరూ ఎక్కడా కలిసి కనిపించకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
Tags:    

Similar News