మ‌లైకా పెళ్లిపై ఆర్భాజ్ రెస్పాన్స్ ఇలా!

Update: 2019-04-01 13:02 GMT
మ‌లైకా అరోరాఖాన్ - అర్జున్ క‌పూర్ ఎఫైర్ గురించి మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆర్భాజ్ నుంచి విడిపోయాక మ‌లైకా స‌ద‌రు యువ‌హీరోతో ప్రేమ‌లో ఉంద‌ని, ఈ ఏప్రిల్ 19న ఆ ఇద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భ ంగా మ‌లైకా మాజీ భ‌ర్త ఆర్భాజ్ ఖాన్ కి ఓ మీడియా స‌మావేశంలో ఇదే ప్ర‌శ్న ఎదురైంది. ``ఈ నెల‌లో మీ మాజీ భార్య మలైకా - అర్జున్‌ కపూర్ పెళ్లాడుకోబోతున్నార‌ట క‌దా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న వినగానే అర్బాజ్‌ ఖాన్‌ ఒక్కసారిగా కాస్తంత లౌడ్ గానే నవ్వేశాడు. దాంతో అక్కడ ఉన్న విలేకరులు కూడా నవ్వేస్తూ ఆ స‌న్నివేశాన్ని తేలికగా మార్చేశార‌ట‌.

ఆ ప్ర‌శ్న‌కు వెంట‌నే ఏం స‌మాధానం చెప్పాలో అర్థం కాని ఆర్భాజ్ అలా బిగ్గ‌ర‌గా న‌వ్వేసి క‌వ‌ర్ చేసేశాడు. స‌మాధానం చెప్పేందుకు త‌డుముకోవ‌డం ఆ సంద‌ర్భ ంలో అంద‌రికీ అర్థ‌మైంది. ``ఈ ప్రశ్న అడగడానికి మీకే చాలా సమయం ప‌ట్టింది కదా. నేను కూడా బాగా ఆలోచించి సమాధానం చెప్పాలి కాబట్టి.. రేపు చెప్పనా`` అంటూ అప్ప‌టికి ఆర్భాజ్ త‌ప్పించుకోవాల‌ని ప్ర‌య‌త్నించ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం ఆర్భాజ్ స్ప ంద‌న‌కు సంబంధించిన‌ ఆ వీడియో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఆర్భాజ్ ఇప్ప‌టికే  వేరొక అందాల భామ‌తో స‌హ‌జీవ‌నంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ జోడీ షికార్ల గురించి మీడియాలో ఇప్ప‌టికే వేడెక్కించే క‌థనాలొచ్చాయి.

మ‌లైకా, ఆర్భాజ్ ఒక‌రి నుంచి ఒక‌రు విడిపోయాక సంతోషంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. ఎవ‌రికి వారే య‌మునా తీరే! అన్న చందంగా ఎవ‌రి దారిలో వాళ్లు సాగి పోతున్నారు. ప్రస్తుతం మలైకా బ్యాచిలరేట్‌ పార్టీలో భాగంగా స్నేహితులతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫోటోల్ని మ‌లైకా స్వ‌యంగా సామాజిక మాధ్య‌మాల్లో ట్వీట్ చేశారు. ఈ పార్టీకి అల్ల‌రి గ‌డుగ్గాయ్ అర్జున్ కూడా సీక్రెట్ గా ఎటెండ్ అయ్యాడ‌ని మ‌రో ఆస‌క్తిక‌ర క‌థ‌నం వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

For Video Click Here



Tags:    

Similar News